SSC Delhi Police Results: కానిస్టేబుల్ నియామక తుది ఫలితాలు విడుదల.. ఎంపికైన అభ్యర్థులు వీరే..
ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) నియామక తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) అధికారిక ప్రకటన వెలువరించింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు రాత పరీక్షలు నిర్వహించగా.. అందుకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 31న వెలువడిన సంగతి తెలిసిందే. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్..
ఢిల్లీ, జనవరి 25: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) నియామక తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) అధికారిక ప్రకటన వెలువరించింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు రాత పరీక్షలు నిర్వహించగా.. అందుకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 31న వెలువడిన సంగతి తెలిసిందే. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(PMT)లను నిర్వహించారు. తాజాగా తుది ఫలితాలు కమిషన్ విడుదల చేసింది. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,547 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీత భత్యాలు చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ నియామక తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రాంగణ నియామకాల్లో చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థుల సత్తా.. ఏకంగా 9,124 కొలువులు
చండీగఢ్ యూనివర్సిటీలో జరిగిన ప్రాంగణ నియామకాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గానూ విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 9,124 కొలువులు సాధించారు. అత్యధికంగా రూ.1.74 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఓ విద్యార్ధి ఎంపికయ్యాడు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా దాదాపు 904 కంపెనీలు ఈసారి నియామకాల్లో పాల్గొన్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా భిన్నకోణాల్లో విద్యార్థులకు మెలకువలు నేర్పడంతో ఎక్కువ మంది విద్యార్ధులు ఎంపికైనట్లు యూనివర్సిటీ వీసీ సత్నామ్‌సింగ్ సంధు తెలిపారు.
పరిశ్రమల సౌజన్యంతో నెలకొల్పుతున్న ప్రయోగశాలల వల్ల ఎక్కువమంది విద్యార్థులు ఎంపిక కాగలుగుతున్నారని, ఉత్తరాదిలోనే అత్యధికంగా వేతనాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. ఇంజినీరింగ్‌లోని వివిధ విభాగాల్లో చదువుతోన్న విద్యార్థుల ఎంపిక కోసం 374 కంపెనీలు, మేనేజ్‌మెంట్/ కామర్స్ సంబంధిత నియామకాలకు 150 కంపెనీలు ఆసక్తి చూపించాయని ఆయన వివరించారు. ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఇంజినీరింగ్ విద్యార్థులకు కొలువులు దక్కినట్లు పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.