Andhra Pradesh: దారుణ ఘటన.. అసూయతో ఆవు పొదుగు కోసిన రైతు! చితకబాదిన స్థానికులు

ఇంటిల్లి పాదికీ నిత్యం పాలిచ్చే ఆ ఆవు పట్ల దాని యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఇవ్వని మరొక వ్యక్తికి ఆవును అమ్మేశాడు. అయితే అమ్మేసిన తర్వాత ఆవు ఎక్కువ పాలు ఇవ్వడం మొదలు పెట్టింది. దీంతో అసూయతో రగిలిపోయిన రైతు ఆ ఆవు పొదుగును కోసేశాడు. ఆగ్రహించిన స్థానికులు రైతును పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు పట్టించారు. ఈ అమానవీయ ఘటన..

Andhra Pradesh: దారుణ ఘటన.. అసూయతో ఆవు పొదుగు కోసిన రైతు! చితకబాదిన స్థానికులు
Man Cuts Cow's Udder
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2024 | 8:26 AM

హిందూపురం, జనవరి 24: ఇంటిల్లి పాదికీ నిత్యం పాలిచ్చే ఆ ఆవు పట్ల దాని యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఇవ్వని మరొక వ్యక్తికి ఆవును అమ్మేశాడు. అయితే అమ్మేసిన తర్వాత ఆవు ఎక్కువ పాలు ఇవ్వడం మొదలు పెట్టింది. దీంతో అసూయతో రగిలిపోయిన రైతు ఆ ఆవు పొదుగును కోసేశాడు. ఆగ్రహించిన స్థానికులు రైతును పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు పట్టించారు. ఈ అమానవీయ ఘటన హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో మంగళవారం (జనవరి 23) చోటు చేసుకొంది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంనకు చెందిన బీరప్ప అనే రైతుకు ఓ అవు ఉంది. అయితే ఆవే తక్కువ పాలు ఇస్తోందని వారం కిందట అదే గ్రామనికి చెందిన మరో వ్యక్తికి దానిని విక్రయించాడు. ఆవును కొన్న సదరు వ్యక్తి నిత్యం ఆవుకు పచ్చిమేత, దాణా అందించడంతో అది ఎక్కువ పాలు ఇస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బీరప్ప కోపంతో రగిలిపోయాడు. తన వద్ద ఉన్నప్పుడు తక్కువ ఇచ్చి, వారికి ఎక్కువ ఇస్తోందని బీరప్పలో అసూయ, ద్వేషం కలిగింది. దీంతో గడ్డివాము దగ్గర ఉన్న ఆవు వద్దకు వెళ్లి, కత్తితో దాని పొదుగును కోసేశాడు. ఆవు ఆర్తనాదాలతో విషయం గ్రహించిన స్థానికులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పటించారు. బీరప్ప చేసిన పనికి నోరు లేని మూగ జీవి ప్రాణం అల్లాడిపోయింది. ఇంతటి దారుణానికి పాల్పడిన బీరప్పను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసకుని, దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణలో మరో ఘటన.. నాణేల పేరుతో ఘరానా మోసం

రూ.2, రూ.5 నాణేలు ఇస్తే బదులుగా రూ.లక్షలు ఇస్తామని నమ్మబలికి కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగింది. ఇందిరాగాంధీ, ఇండియా మ్యాప్‌ ఉన్న నాణేలకు లక్షల డబ్బు ఇస్తామని మభ్యపెట్టిస్తారు. ఆశపడి ఒప్పుకున్న వారికి రకరకాల ఛార్జీల పేరుతో అందినంత దండుకునే ముఠాపై సైబర్ పోలీసులు డేగ కన్నేశారు. ఇలాంటి వారి వలలో పడొద్దని, ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే 1930కి ఫోన్‌ చేయాలని సూచించారు. లేదంటే 87126 72222కి వాట్సాప్‌లో లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.