Ramoji Film City Accident: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘోర ప్రమాదం.. సీఈవో మృతి, ఛైర్మన్‌కి తీవ్రగాయాలు

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం జరుగుతున్న కార్పొరేట్ ఈవెంట్‌లో క్రేన్‌ కూలిపోవడంతో ఓ ప్రైవేట్‌ కంపెనీ సీఈవో మృతి చెందగా, చైర్మన్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షాగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి కంపెనీ చైర్మన్ విశ్వనాథ రాజుగా పోలీసులు తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీలో కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల..

Ramoji Film City Accident: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘోర ప్రమాదం.. సీఈవో మృతి, ఛైర్మన్‌కి తీవ్రగాయాలు
Accident At Ramoji Film City
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 19, 2024 | 6:04 PM

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం జరుగుతున్న కార్పొరేట్ ఈవెంట్‌లో క్రేన్‌ కూలిపోవడంతో ఓ ప్రైవేట్‌ కంపెనీ సీఈవో మృతి చెందగా, చైర్మన్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షాగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి కంపెనీ చైర్మన్ విశ్వనాథ రాజుగా పోలీసులు తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీలో కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. అసలేం జరిగిందంటే..

విస్టెక్స్ ఏషియా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ కంపెనీ సీఈవో సంజయ్ షాతోపాటు పలువురు కంపెనీ అధికారులు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను స్టేజ్‌ పైకి 20 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ సాయంతో కిందికి దింపడానికి రెండు వైపులా 6MM మందం కలిగిన ఇనుప తీగలను అమర్చారు. ఈ క్రమంలో కంపెనీ సీఈవో సంజయ్ షా, ఛైర్మన్‌ విశ్వనాథ రాజును క్రేన్‌ సాయంతో కిందికి దింపుతున్న సమయంలో ఈ రెండు తీగల్లో ఒకటి ఆకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో వారిని తీసుకువెళుతున్న క్రేన్ కంపార్ట్‌మెంట్ కూలిపోయింది. ఈ ఘటనలో కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి చెందారు. ఛైర్మన్‌ విశ్వనాథ రాజు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియో సౌకర్యం ఉంది. దాదాపు 1,666 ఎకరాలలో విస్తరించి ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీని 1996లో రామోజీ రావు స్థాపించారు. ఇక్కడ వివిధ సినిమా షూటింగ్‌లకు సంబంధిత కార్యకలాపాలు నిత్యం జరుగుతుంటాయి. పైగా నిత్యం వేల మంది సందర్శకులు రామోజీ ఫిల్మ్‌ సిటీని చూసేందుకు వెళ్తుంటారు. అలాంటి చోట తాజాగా ప్రమాదం చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం