School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 17) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో 3 రోజులపాటు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత గురువారం (జనవరి 18) వరకు సెలవులు ఇచ్చిన రాష్ట్ర సర్కార్‌.. తాజాగా శనివారం (జనవరి 20) వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో ఈనెల 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి..

School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు
School Holidays
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2024 | 4:06 PM

అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 17) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో 3 రోజులపాటు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత గురువారం (జనవరి 18) వరకు సెలవులు ఇచ్చిన రాష్ట్ర సర్కార్‌.. తాజాగా శనివారం (జనవరి 20) వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో ఈనెల 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు జ‌న‌వ‌రి 22న అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ‌ప్రతిష్ట కార్యక్రమం చేపట్టనున్నారు. దీంతో దేశవాప్తంగా పలు రాష్ట్రాలు స్కూల్స్‌, కాలేజీల‌కు ఈ రోజున సెల‌వు ప్రక‌టించాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు కూడా జ‌న‌వ‌రి 22న విద్యాసంస్థలకు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. జ‌న‌వ‌రి 22న సెలవు ప్రకటిస్తే 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదలకాలేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గోవా, చత్తీస్‌ఘడ్‌, హర్యానా.. రాష్ట్రాలు జనవరి 22వ తేదీన సెలవు ప్రకటించాయి కూడా. ఏపీలో పాఠశాలలకు వరుసగా 13 రోజులు పాటు సెలవులు వ‌చ్చాయి. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జనవరి 9 నుంచి 18 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అటు తెలంగాణలోనూ జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు వచ్చాయి. తెలంగాణ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరగనుండటంతో అన్ని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ZPP/MPP, ఎయిడెడ్, ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలలు విద్యార్ధులను సన్నద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్‌ డే సెలవు కూడా ఉంది. వరుస సెలవులు దృష్ట్యా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!