AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతీ 100 మందిలో 88 మంది కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారు.. కారణం ఏంటో తెలుసా.?

లింక్ట్‌ఇన్‌ ప్రకారం.. ఉద్యోగార్థులు ప్రస్తుతం తమ ఉత్పాదకతతో పాటు వృద్ధిపై ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు తేలింది. 2024లో భారత్‌లో దాదాపు 88 శాతం మంది కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తేలింది. గతేడాదితో పోల్చితే ఇది 4 శాతం అధికం కావడం గమనార్హం. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతోన్న వారిలో...

ప్రతీ 100 మందిలో 88 మంది కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారు.. కారణం ఏంటో తెలుసా.?
Employees
Narender Vaitla
|

Updated on: Jan 18, 2024 | 5:43 PM

Share

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. జీతంతో పాటు స్థాయి ఎదగాలని భావిస్తుంటారు. అందుకోసమే ప్రయత్నిస్తుంటారు. తమ నైపుణ్యాలను పెంచుకుంటారు. తాజాగా ప్రముఖ బిజినెస్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన లింక్డ్ఇన్‌ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

లింక్ట్‌ఇన్‌ ప్రకారం.. ఉద్యోగార్థులు ప్రస్తుతం తమ ఉత్పాదకతతో పాటు వృద్ధిపై ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు తేలింది. 2024లో భారత్‌లో దాదాపు 88 శాతం మంది కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తేలింది. గతేడాదితో పోల్చితే ఇది 4 శాతం అధికం కావడం గమనార్హం. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతోన్న వారిలో అత్యధికంగా జీతం పెరుగుదల కోసమే అని సర్వేలో తేలింది.

ఇదిలా ఉంటే లింక్డ్‌ఇన్‌ నివేదిక ప్రకారం.. జాబ్ సెర్చ్‌ యాక్టివిటీ 2023లో 9 శాతం పెరిగిందని తేలింది. గతేడాది ఉద్యోగాలు మారిన వారిలో 42 శాతం మంది వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ కోసం, 79 శాతం మంది ప్రజలు మెరుగైన ఉద్యోగం కోసం ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ నుంచి కొత్త సంస్థలోకి వెళ్లారని తేలింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అభివృద్ధి చెందుతోన్న ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా అభ్యర్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని లింక్డ్‌ఇన్‌ తెలిపింది.

ఇక 45 శాతం మందికి తాము కోరుకున్న ఉద్యోగం కోసం నైపుణ్యాలను ఎలా మార్చుకోవాలో తెలియదని లింక్ట్‌ఇన్‌ సర్వే చెబుతోంది. ఇది కోరుకున్న ఉద్యోగం దొరకడం కష్టంగా మారడానికి కారణంగా మారుతోందని సర్వే చెబుతోంది. ఇక లింక్డ్ఇన్‌ ప్రకారం 72 శాతం మంది నిపుణులు జాబ్‌ సెర్చ్‌కోసం వీడియో లేదా డిజిటల్ రెజ్యూమ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తుననట్లు తేలింది. 79 శాతం మంది నిపుణులు లింక్డ్‌ఇన్‌లో ఎక్కువ కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారు. 83 శాతం మంది తమ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో మరింత చురుకుగా ఉంటున్నారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..