CBSE CTET 2024 Hall Tickets: సీటెట్ అడ్మిట్‌కార్డులు విడుదల.. జనవరి 21న పరీక్ష
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024 అడ్మిట్‌కార్డులు గురువారం (జనవరి 18) విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్‌ఈ ప్రకటించింది. జనవరి 21న ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగనుంది. కాగా సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది..
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024 అడ్మిట్‌కార్డులు గురువారం (జనవరి 18) విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్‌ఈ ప్రకటించింది. జనవరి 21న ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగనుంది. కాగా సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుందన్న విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి జరుగుతుంది. రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారికి జరుగుతుంది. సీటెట్‌లో వచ్చిన స్కోర్ లైఫ్‌లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు.
ఐబీపీఎస్ ఎస్‌వో మెయిన్స్ కాల్ లెటర్లు విడుదల.. జనవరి 28వ తేదీన రాత పరీక్ష
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రకటనల విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ పరీక్ష జనవరి 28వ తేదీన జరుగనుంది. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1402 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్, పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఏహెచ్‌ఏ రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక సహాయకుల నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్ 31న ఈ జరిగిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 1,896 పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.