Heart Attack: క్లాస్‌ రూంలో పాఠాలు వింటూనే గుండెపోటుతో కుప్పకూలిన విద్యార్ధి.. వీడియో వైరల్

ఓ విద్యార్ధి పబ్లిక్‌ సర్విస్‌ పరీక్షలకు కోచింగ్ ఒక సెంటర్‌లో ప్రపేరవుతూ తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. క్లాస్‌ రూంలో పాఠాలు వింటూనే నిశ్శబ్ధంగా కిందికి వరిగిపోయాడు. తోటి విద్యార్ధులు గమనించి ఏం జరిగిందో తెలుసుకునేలోపే విద్యార్ధి ప్రాణాలు వదిలేశాడు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Heart Attack: క్లాస్‌ రూంలో పాఠాలు వింటూనే గుండెపోటుతో కుప్పకూలిన విద్యార్ధి.. వీడియో వైరల్
Student Died Of Heart Attack
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2024 | 2:43 PM

ఇండోర్‌, జనవరి 18: ఓ విద్యార్ధి పబ్లిక్‌ సర్విస్‌ పరీక్షలకు కోచింగ్ ఒక సెంటర్‌లో ప్రపేరవుతూ తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. క్లాస్‌ రూంలో పాఠాలు వింటూనే నిశ్శబ్ధంగా కిందికి వరిగిపోయాడు. తోటి విద్యార్ధులు గమనించి ఏం జరిగిందో తెలుసుకునేలోపే విద్యార్ధి ప్రాణాలు వదిలేశాడు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాకు చెందిన రాజ (18) అనే విద్యార్ధి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇండోర్‌లో ఉంటున్నాడు. అతను మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల కోసం అదే జిల్లాలోని భవర్‌కువాలోని ఓ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాడు. ప్రతి రోజూ మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా కోచింగ్‌ సెంటర్‌కు వచ్చిన రాజా క్లాస్‌ రూంలో కూర్చుని పాఠాలు వినసాగాడు. అయితే రాజా తరగతి గదిలో ఒక్కసారిగా అశ్వస్థతకు గురయ్యాడు. చాతినొప్పితో విలవిలలాడుతూ కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. సెకన్ల వ్యవధిలోనే తాను కూర్చున్న కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. గమనించిన తోటి విద్యార్ధులు రాజాను పైకిలేపి బెంచ్‌పై కోర్చోపెట్టారు. అప్పటికే రాజా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజా మృతి చెందినట్లు ధృవీకరించారు. క్లాస్‌ రూంలో అమర్చి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఈ మొత్తం సంఘటన రికార్డు అయ్యింది.

ఇవి కూడా చదవండి

కోచింగ్‌ ఇన్‌స్టిట్యూ యాజమన్యం విద్యార్ధి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమకు పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజీని అందించడం లేదని ఆరోపించారు. విద్యార్థి తండ్రి పీహెచ్‌ఈ విభాగంలో పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.