AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Liquor: గోవా నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చేప్పుడు ఎంత మద్యం తీసుకురావొచ్చు..?

గోవాలో మద్యం చాలా అగ్గువకే దొరుకుందన్న విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లి వచ్చేటప్పుడు ఏపీ, తెలంగాణకు ఎంత మద్యం తీసుకురావొచ్చనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే మీరు వచ్చే రాష్ట్రం తాలూకా నిబంధనలు మీరు ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది.

Goa Liquor: గోవా నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చేప్పుడు ఎంత మద్యం తీసుకురావొచ్చు..?
Goa Liquor
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2024 | 3:36 PM

Share

గోవా అనేది ఇండియాలో ఎంత పెద్ద టూరిస్ట్ ప్రాంతం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోవాకు అంతకంతకూ టూరిస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా న్యూ ఇయర్ సమయంలో లక్షల మంది గోవా తీరాలకు వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో గోవాలో లిక్కర్ చాలా చౌకగా దొరుకుతుంది. అక్కడ దొరికే మద్యాన్ని మన తెలుగు రాష్ట్రాలకు తెచ్చుకోవచ్చా..? ఈ విషయంలో చాలామందికి డౌట్స్ ఉన్నాయి.  ఇప్పుడు మీకు పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాం. ఏపీలో గోవా మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. వేరే రాష్ట్రం నుంచి ఒక్క లిక్కర్ బాటిల్‌ను కూడా తెచ్చే వీలు లేకుండా జగన్ సర్కార్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.

అటు తెలంగాణలో కూడా గోవా లిక్కర్ అనుమతించరు.  తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ చట్టం ప్రకారం పర్మిషన్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ మోతాదులో అయినా మద్యం తీసుకురావడం నేరం. సో.. రోడ్డు, రైలు, వాయి, జల మార్గాల్లో గోవా నుంచి.. ఏపీ, తెలంగాణకు లిక్కర్ అనుమతించరు. గోవా లిక్కర్ తీసుకెళ్లాలంటే.. అక్కడ అథారిటీ కలిగిన డీలర్ లేదా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి 20 రూపాయలు( ఒక్కో బాటిల్‌కు 10) చెల్లించి తీసుకున్న పర్మిట్ స్లిప్ అవసరం ఉంటుంది. ఇక మీరు బుర్రలో పెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ పర్మిట్స్.. మీరు గోవా నుంచి లిక్కర్ తీసుకువెళ్లేందుకు మాత్రమే. మీరు వెళ్లే రాష్రాల్లో వాటిని అనుమతించకపోవచ్చు.  గోవా నుండి మహారాష్ట్ర, కర్ణాటకలకు ఒక్క మద్యం బాటిల్‌ను కూడా రవాణా చేయడానికి కూడా అనుమతి లేదు.

ఒడిశా, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, మణిపూర్, అస్సాం, మధ్యప్రదేశ్, హిమాచల్‌ రాష్ట్రాలకు రోడ్డు మార్గం ద్వారా పర్మిట్ తీసుకుని మీరు 2 బాటిల్స్ తీసుకెళ్లవచ్చు.

(మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..