AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నటుడు సురేష్ గోపీ కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

మలయాళ నటుడు సురేష్ గోపీ పెద్ద కూతురు భాగ్య సురేశ్‌, ప్రముఖ వ్యాపారవేత్త శ్రేయాస్ మోహన్‌ల వివాహం బుధవారం ఉదయం 8.45 గంటలకు త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కేరళ పర్యాటనలో ఉన్న ఆయన త్రిసూర్‌కి వచ్చారు. సురేష్‌ గోపీ కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి, వరమాలలు అందించారు..

PM Modi: నటుడు సురేష్ గోపీ కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
PM Modi Attends Suresh Gopi's Daughter's Wedding
Srilakshmi C
|

Updated on: Jan 17, 2024 | 4:31 PM

Share

తిరువనంతపురం, జనవరి 17: మలయాళ నటుడు సురేష్ గోపీ పెద్ద కూతురు భాగ్య సురేశ్‌, ప్రముఖ వ్యాపారవేత్త శ్రేయాస్ మోహన్‌ల వివాహం బుధవారం ఉదయం 8.45 గంటలకు త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కేరళ పర్యాటనలో ఉన్న ఆయన త్రిసూర్‌కి వచ్చారు. సురేష్‌ గోపీ కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి, వరమాలలు అందించారు. మోదీరాకతో ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సురేశ్‌ గోపి కుటుంబం, కొత్త జంటతో మోదీ మాట్లాడారు. అనంతరం వారితో ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత మరో 30 జంటలను ఆశీర్వదించిన మోదీ, వేదిక నుంచి వెళ్లిపోయారు. ఓవైపు అయోధ్యలో రామ మందిరం పూజ కార్యక్రమాలు జరుగుతుండగా.. ప్రధాని సమయాన్ని వెచ్చించి ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని తొలుత కొచ్చి నుంచి హెలికాప్టర్‌లో గురువాయూర్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గురువాయూర్‌ ఆలయానికి చేరుకున్నారు. వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం వేదిక వద్దకు చేరుకున్నారు. మోదీ సాంప్రదాయ దుస్తుల్లో ధోతీ, షర్ట్‌లో కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఈ వివాహ వేడుకకు నటుడు మోహన్‌లాల్, మమ్ముట్టి, దిలీప్‌, ఖుష్బు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరితోపాటు దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, కుంజకో బోబన్ సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు భాగ్య సురేష్ ఎరుపు రంగు కాంచీపురం చీరను ధరించగా, వరుడు శ్రేయాస్ మోహన్ కేరళ ధోతీ, శాలువాలో కనిపించారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.