AP High Court Recruitment 2024: ఏపీ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్‌ జడ్జి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.1,36,520 వరకు జీతం

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ అమరావతిలోని ఏపీ స్టేట్‌ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 39 సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 32 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన, 7 పోస్టులు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా భర్తీ కానున్నాయి..

AP High Court Recruitment 2024: ఏపీ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్‌ జడ్జి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.1,36,520 వరకు జీతం
AP High Court
Follow us

|

Updated on: Jan 14, 2024 | 3:07 PM

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ అమరావతిలోని ఏపీ స్టేట్‌ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 39 సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 32 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన, 7 పోస్టులు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా భర్తీ కానున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్చి 1, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రాన్స్‌ఫర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు లా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత కేటగిరీలో సభ్యులై ఉండాలి.

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు జనవరి 1, 2024వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి జనవరి 1, 2024వ తేదీ నాటికి 48 ఏళ్లు మించకుండా ఉండాలి. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 1, 2024వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.1500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు జీత భత్యాలు చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం..

స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్కులకు 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు ఉంటుంది. 2 గంటలపాటు పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి 3 పేపర్లకు రాత పరీక్ష ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్‌ 3 గంటల్లో పరీక్ష రాయాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీల వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 31, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 1, 2024.
  • స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకునే తేదీ: మార్చి 15, 2024.
  • కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 13, 2024.
  • ప్రాథమిక కీ విడుదల తేదీ: ఏప్రిల్‌ 18, 2024.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..
కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..
బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..