AP AHA Final Answer Key: యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ రాత పరీక్ష తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. త్వరలో ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ (ఏహెచ్‌ఏ) పోస్టులకు సంబంధించి నియామక పరీక్ష తుది ఆన్సర్‌ 'కీ' విడుదలైంది. ఈ మేరకు ఆన్సర్‌ కీతోపాటు రాత పరీక్ష ప్రశ్నపత్రం కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ 31న నియామక పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన విషయం తెలిసిందే. కాగా పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో..

AP AHA Final Answer Key: యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ రాత పరీక్ష తుది ఆన్సర్‌ 'కీ' విడుదల.. త్వరలో ఫలితాలు
AP AHA Final Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 14, 2024 | 2:40 PM

అమరావతి, జనవరి 14: ఆంధ్రప్రదేశ్‌లో యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ (ఏహెచ్‌ఏ) పోస్టులకు సంబంధించి నియామక పరీక్ష తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదలైంది. ఈ మేరకు ఆన్సర్‌ కీతోపాటు రాత పరీక్ష ప్రశ్నపత్రం కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ 31న నియామక పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన విషయం తెలిసిందే. కాగా పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 1,896 యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ (ఏహెచ్‌ఏ) ఖాళీలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. నియామక ప్రక్రియలో గోపాలమిత్ర / గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ రాత పరీక్ష ప్రశ్నపత్రం, ఫైనల్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2 ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023 (SSC CHSL) టైర్‌-2 ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జనవరి 13 నుంచి 15వ తేదీలోగా ప్రాథమిక ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం కల్పించింది. కాగా గత ఏడాది నవంబర్‌ 2న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,762 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు తదితర వాటిల్లో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి మే నెలలో ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. టైర్‌-1, టైర్‌ 2 రాత పరీక్షలు, టైపింగ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2 ప్రాథమిక ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!