Hair Fall During Winter: ఉల్లి రసంతో ఇలా చేశారంటే జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది..

నేటి జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కారణం లేకుండానే వెంట్రుకలు రాలిపోతుంటాయి. శీతాకాలంలో ఈ సమస్య రెట్టింపు అవుతుంది. రోజుకు 100 వెంట్రుకలు రాలడం సహజం. రాలిన జుట్టు ప్రదేశంలో కొత్త వెంట్రుకలు పెరుగుతాయి. కానీ కొత్త జుట్టు పెరగడం ఆగిపోయినప్పుడు సమస్య మొదలవుతుంది. ఫలితంగా ఆ స్థలం ఖాళీగా ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ ఆపడానికి, కొత్త జుట్టు పెరగడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, కొత్త జుట్టు పెరగడానికి ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Jan 12, 2024 | 7:56 PM

1 / 5
ప్రాచీన కాలం నుంచి వేపను సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడంలో వేపనూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వేప నూనె స్కాల్ప్‌పై అదనపు నూనె ఉత్పత్తిని నిలిపివేస్తుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది.

2 / 5
10-15 వేప ఆకులను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో కలిపిన కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి తలకు పట్టించాలి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

3 / 5
కొత్త జుట్టు పెరుగడంలో ఉల్లిపాయ రసం అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ రసం కూడా స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతే కాకుండా ఉల్లిపాయ రసంలోని పదార్థాలు జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. జుట్టు దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది.

4 / 5
ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని, దాని నుండి రసాన్ని తీయాలి. అయితే ఉల్లిపాయ రసాన్ని నేరుగా తలకు పట్టించకూడదు. ఆముదంతో మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. దీన్ని జుట్టు చివర్ల వరకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేస్తే క్రమంగా జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి.

5 / 5
Follow us