Prabhas: మళ్లీ ట్రెండ్ అవుతున్న ప్రభాస్ సినిమా.. ఎందుకంటే ??
రిలీజ్‌కి ఓ సినిమా, సెట్స్ మీద రెండు మూడు సినిమాలు, క్యూలో ఇంకొన్ని మూవీస్.. గత కొన్నేళ్లుగా డార్లింగ్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఇది. ఎప్పుడెప్పుడా అంటూ జనాలు ఎదురుచూసిన సలార్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ కల్కి మీదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కావాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో కనిపించింది సలార్ మూవీ. ఉన్న హైప్‌ని కాస్త తగ్గించి, రిలీజ్ డేట్ వాయిదా వేసి, మూవీ క్వాలిటీ పెంచి... ఎలాగైతేనేం ప్రేక్షకులకు కావాల్సిన ప్రాజెక్టును సైలెంట్‌గా డెలివరీ చేశారు ప్రశాంత్ నీల్.
Updated on: Jan 12, 2024 | 7:51 PM

రిలీజ్‌కి ఓ సినిమా, సెట్స్ మీద రెండు మూడు సినిమాలు, క్యూలో ఇంకొన్ని మూవీస్.. గత కొన్నేళ్లుగా డార్లింగ్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఇది. ఎప్పుడెప్పుడా అంటూ జనాలు ఎదురుచూసిన సలార్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ కల్కి మీదే ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కావాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో కనిపించింది సలార్ మూవీ. ఉన్న హైప్‌ని కాస్త తగ్గించి, రిలీజ్ డేట్ వాయిదా వేసి, మూవీ క్వాలిటీ పెంచి... ఎలాగైతేనేం ప్రేక్షకులకు కావాల్సిన ప్రాజెక్టును సైలెంట్‌గా డెలివరీ చేశారు ప్రశాంత్ నీల్. డైరక్టర్‌గా సూపర్ అనిపించుకున్నారు ప్రశాంత్.

సలార్ పార్ట్ ఒన్ సీజ్‌ఫైర్‌తో ప్రశాంత్ పాస్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ క్యూలో ఉన్న డైరక్టర్ నాగ్ అశ్విన్. కల్కి మూవీతో ఫ్యూచర్ ప్రభాస్‌ని చూపించబోతున్నారు ఈ డైరక్టర్. అప్పుడొస్తుంది, ఇప్పుడొస్తుంది అంటూ కల్కి మీద కూడా ఇప్పటికే అంచనాలు పెంచుకుంటున్నారు జనాలు.

మీరు ఎంతైనా ఊహించుకోండి... అంతకు మించే సినిమా ఉంటుందనే హింట్స్ అందుతున్నాయి. దానికి తోడు ఉత్తరాది నుంచి అమితాబ్, దీపిక పదుకోన్, దిశా పాట్ని కూడా ఈ సినిమాతో సందడి చేయబోతున్నారు. సినిమా మేకింగ్‌కి అయ్యే సమయంలో, సగం ఇంజనీరింగ్ పనులకే అవుతోందంటూ ఉన్న విషయాన్ని బద్ధలు కొట్టేశారు నాగ్ అశ్విన్.

అన్నిటినీ కంప్లీట్ చేసుకుని మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఆల్రెడీ డిసెంబర్‌లో విడుదలైన సలార్ వైబ్స్ ని ఆస్వాదిస్తున్న రెబల్ ఫ్యాన్స్, ఇక సమ్మర్‌లోనూ అల్ట్రా కూల్‌గా కల్కి తో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతారన్నమాట.




