- Telugu News Photo Gallery Technology photos Are you facing charging problem in your mobile?, If you follow these tips, your problem will be solved, Mobile Charging details in telugu
Mobile Charging: మీ మొబైల్‌లో చార్జింగ్ సమస్య వేధిస్తుందా? ఈ టిప్స్ పాటిస్తే మీ సమస్య ఫసక్..
ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ముఖ్యంగా ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే స్మార్ట్‌ఫోన్ మీ సెల్‌ఫోన్‌లో పవర్ కోల్పోవడం ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది. అయితే మీరు మీ ఫోన్ బ్యాటరీని ఒకే ఛార్జ్‌తో ఎక్కువసేపు ఉండేలా చేయడం నిపుణులుకొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Jan 13, 2024 | 1:19 PM

ముందుగా మీ ఫోన్ డిస్‌ప్లేను ఆటో మోడ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే డిస్‌ప్లే బ్రైట్ నెస్ మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తర్వగా డ్రెయిన్ అయ్యేలా చేస్తుంది.

అలాగే మీ స్మార్ట్ వాడని సమయంలో స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. మీ ఫోన్ ఒక నిమిషం లేదా ఒకటిన్నర నిమిషాలు వేచి ఉండకుండా 30 సెకన్ల తర్వాత లాక్ అయ్యేలా సెట్ చేసుకుంటే బ్యాటరీ సేవ్ అవుతుంది.

మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి దాదాపుగా మీరు శక్తి కోల్పోయే వరకు వేచి ఉండకూడదు. మీకు వీలైనంత వరకు 20 నుంచి 80 శాతం మధ్య ఛార్జింగ్‌లో ఉంచాలని సూచిస్తున్నారు. రాత్రిపూట మీ ఫోన్‌ను చార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీకి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ-పవర్ మోడ్‌కు మారడం బ్యాటరీ శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది. బ్యాటరీపై ఒత్తిడి లేకుండా తక్కువ పవర్ మోడ్‌ను సెట్ చేసుకోవాలి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా యాప్‌లు రోజంతా నిరంతరం రిఫ్రెష్ అవుతాయి. కానీ చాలా మందికి ఆ సమాచారాన్ని ప్రతి అరగంటకు ప్రతి గంటకు వారి రోజులో అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు నిజంగా సెట్టింగ్‌లలోకి వెళ్లి వాటిని సర్దుబాటు చేయవచ్చు, తద్వారా ఆ నోటిఫికేషన్‌లు లేదా ఆ నవీకరణలు ఆ నిరంతర ప్రాతిపదికన జరగవు




