Best Photo Editing Apps: ఫొటో ఎడిటింగ్ ఇక చాలా ఈజీ.. ఈ యాప్స్‌తో ఫోన్లోనే సింపుల్ చేసేయండి..

ఇటీవల కాలంలో ఫోన్లోనే ఫొటో ఎడిటింగ్ చేయగలిగే యాప్ లకు డిమాండ్ పెరుగుతోంది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో తమ ఫొటోలను షేర్ చేసుకోవాలనుకునేవారు ఇన్ స్టంట్ ఎడిటింగ్ యాప్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ కోసం వెతుకుతున్నారు. వాస్తవానికి ఫోన్లలోనే అధిక రిజల్యూషన్ కెమెరాలు రావడం.. వాటిల్లో షార్ట్స్, రీల్స్ కూడా చేస్తుండటంతో అందరూ ఫొన్లోనే బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ కావాలనుకుంటున్నారు. మీరు కూడా అలాంటి యాప్స్ కోసం వెతుకుతుంటే ఈ కథనం మీ కోసమే. దీనిలో బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ను మీకు పరిచయం చేస్తున్నాం.

Madhu

|

Updated on: Jan 13, 2024 | 12:32 PM

ఫొటోషాప్ ఎక్స్ ప్రెస్.. ఈ యాప్ ను www.adobe.com నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిలో ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. అయితే వాటిని యాక్సెస్ చేయాలంటే క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ ఉండాలి. ఇది ఆండ్రాయిడ్ తోపాటు ఐఓఎస్ డివైజ్ లకు కూడా సపోర్టు చేస్తుంది. ఇది పొటో ఎడిటింగ్ లో ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ తీసిపోని రీతిలో దీనిలో ఫీచర్లు ఉంటాయి. ఇతర అడోబ్ యాప్స్ తో కలిసి పనిచేస్తుంది.

1 / 5
స్నాప్‌సీడ్.. ఈ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాపిల్ స్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ కంపెనీ నుంచి వస్తున్న ఈ యాప్. దీనిలో అత్యాధునిక టూల్స్ మీకు బాగా ఉపకరిస్తాయి. అడ్వాన్స్ డ్ ప్రీసెట్స్ ఉంటాయి. ప్రిసైజ్ అడ్జస్ట్ మెంట్స్ అందుబాటులో ఉంటయాయి. యాడ్ ఫ్రీగాదీనిని వినియోగించుకోవచ్చు. అయితే బిగినర్స్ దీనిని వినియోగించడం కాస్త కష్టం.

2 / 5
ఇన్‌స్టాగ్రామ్.. దీనిని కూడా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సోషల్ మీడియా యాప్ లో రీల్స్ కోసం ఇన్ బిల్ట్ ఎడిటింగ్ కు అవకాశం కల్పించారు. దీనిలో సింపుల్ టు యూజ్ ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా స్టైల్డ్ ఎఫెక్ట్స్ ఫొటోలకు ఇవ్వొచ్చు. స్ట్రక్చర్, షార్పెనింగ్ స్లైడర్స్, ఫినిషింగ్ టచెస్ కోసం ప్రత్యేక ఫీచర్స్ ఉంటాయి. ఇన్ స్టంట్ షేరింగ్ కూడా దీనిలో సాధ్యమవుతుంది.

3 / 5
గూగుల్ ఫొటోస్.. ఈ యాప్ ను కూడా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా కాంప్రిహెన్సివ్ ఫొటో యాప్. దీనిలో 15జీబీ వరకూ మెమరీ కూడా ఉంటుంది. దీనిలో ఫొటోస్ సేవ్ చేసుకోవచ్చు. యాడ్ ఫ్రీ గా దీనిని వినియోగించుకోవచ్చు. దీనిలో మ్యాజిక్ ఎరేసర్, రిమూవల్ ఆఫ్ అన్ వాంటెడ్ అబ్జెక్ట్స్ ను ఫొటో నుంచి తొలగించొచ్చు.

4 / 5
ఫొటో షాప్ లైట్ రూం.. ఇది కూడా  www.adobe.com నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిలో చాలా వేగంగా, సులభంగా చిత్రాలను ఎడిట్ చేసుకోవచ్చు. దీనిలో కూడా ప్రీమియం ఫీచర్లు వినియోగించాలంటే క్రియేటివ్ క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ అవసరం అవుతుంది. ఇది కూడా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో వినియోగించుకోవచ్చు. దీనిలో చిత్రాల్లో లెన్స్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు.

5 / 5
Follow us