Periods Care: పీరియడ్స్ నొప్పులను తగ్గించుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు..
పీరియడ్స్ ఈ మాట ఎత్తగానే మహిళల్లో అసహనం మొదలవుతుంది. నెలసరి అంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే నెలసరి వచ్చిన మొదలు ఐదు రోజుల వరకూ రక్త స్రారవం, కడుపులో నొప్పులు, నడుము నొప్పి, వికారం, నీరసం ఇలా రక రకాల సమస్యలు ఉంటాయి. రుతుక్రమం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒకరికి నార్మల్‌గా బ్లీడింగ్ అయితే.. మరొకరికి విపరీతంగా ఉంటుంది. ఇలా నెలసరిలో వచ్చే నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే..

పీరియడ్స్ ఈ మాట ఎత్తగానే మహిళల్లో అసహనం మొదలవుతుంది. నెలసరి అంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే నెలసరి వచ్చిన మొదలు ఐదు రోజుల వరకూ రక్త స్రారవం, కడుపులో నొప్పులు, నడుము నొప్పి, వికారం, నీరసం ఇలా రక రకాల సమస్యలు ఉంటాయి. రుతుక్రమం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒకరికి నార్మల్‌గా బ్లీడింగ్ అయితే.. మరొకరికి విపరీతంగా ఉంటుంది. ఇలా నెలసరిలో వచ్చే నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మీ ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకోవాలి. నెలసరి సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యానికి దూరంగా ఉండాలి:
మద్యం తాగే అలవాటు ఉన్నవారు.. పీరియడ్స్ వచ్చిన సమయంలో.. ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. పీరియడ్స్ సమయంలో నొప్పులకు ఆల్కహాల్ ప్రతిబంధకం కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా డ్రింక్ చేసే అలవాటు ఉన్నవారికి మెగ్నీషియం స్థాయిలు అనేవి తగ్గిపోతాయి. అందుకే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.
కెఫీన్ ఉన్నటువంటి పదార్థాలు:
నెలసరి సమయంలో కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి:
పీరియడ్స్ సమయంలో ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయానాల్లో తేలింది. అందుకే నెలసరి సమయంలో ప్రాసెస్డ్ ఫుడ్‌కి కూడా దూరంగా ఉండాలి.
ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా మంచిది:
నెలసరి సమయంలో మహిళలకు తీవ్రంగా రక్త స్రావం అయి నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో హెల్దీ అయిన ఆహారం తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, పాలకూర, బ్రోకలీ, కివీ ఫ్రూట్స్, మామిడి, టమాటా వంటి తినాలి. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు అదుపు అవుతాయి.
అదే విధంగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకుంటే శరీరంలో కణాలు సక్రమంగా పని చేస్తాయి. దీని వల్ల నొప్పులు, స్వెల్లింగ్ ఏమైనా ఉంటే తగ్గేందుకు దోహద పడుతుంది. చియా సీడ్స్చ వాల్ నట్స్, సాల్మన్ ఫిష్, మెకోరాల్ వంటివి తింటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








