AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ రూట్‌లో వందే భారత్ రైలు రద్దు.. పూర్తి వివరాలు..

ప్రయాణీకులకు ముఖ్యగమనిక. మరీ ముఖ్యంగా అయోధ్య వెళ్లేవారికి ఈ అలెర్ట్. వందేభారత్ రైలుతో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వారం పాటు రద్దు చేసింది భారతీయ రైల్వే. జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ రూట్‌లో వందే భారత్ రైలు రద్దు.. పూర్తి వివరాలు..
Vande Bharat Trains
Ravi Kiran
|

Updated on: Jan 17, 2024 | 4:17 PM

Share

ప్రయాణీకులకు ముఖ్యగమనిక. మరీ ముఖ్యంగా అయోధ్య వెళ్లేవారికి ఈ అలెర్ట్. వందేభారత్ రైలుతో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వారం పాటు రద్దు చేసింది భారతీయ రైల్వే. జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటంతో.. ముందస్తుగా రైళ్లను రద్దు చేసింది. అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా మరో 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.

ఇప్పటికే అయోధ్య కాంట్ నుండి ఢిల్లీకి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు నార్తర్న్ రైల్వే స్పష్టం చేసింది. ఇక ఈ డబ్లింగ్ పనులు కారణంగా ఆ రైలు రద్దును జనవరి 22 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్‌లల్లా పవిత్రోత్సవానికి జరుగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్‌లో ట్రాక్ డబ్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

స్కూల్స్‌కు సెలవులు..

జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా.. పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఆ రోజున సెలవు ప్రకటించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో అటు స్కూల్స్‌, ఇటు మద్యం దుకాణాలు జనవరి 22న బంద్‌ కానున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్, హర్యానా, రాజస్థాన్‌లో ఆయా ప్రభుత్వాలు పాఠశాలలకు గవర్నమెంట్ హాలిడే ప్రకటించాయి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై