Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chile Plane Crash Video: రోడ్డుపై ప్రయాణిస్తోన్న కారుపై కుప్పకూలిన విమానం.. పైలట్‌ మృతి! నలుగురికి గాయాలు

చిలీ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ స్తంబానికి విమానం ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్‌ మృతి చెందాడు. చిలీలోని పంగులెమో విమానాశ్రయం (TLX) సమీపంలో ఈ విమానం కూలిపోయింది. సెంట్రల్ చిలీలోని తాల్కాలో ప్రమాదం జరిగింది. మృతి చెందిన పైలట్ స్పెయిన్ వార్డ్ ఫెర్నాండో సోలన్స్ రోబుల్స్ (58)గా గుర్తించారు. విమాన శకలాలు ఓ కారుపై పడటం వల్ల అందులో ప్రయాణిస్తున్న నలుగురికి..

Chile Plane Crash Video: రోడ్డుపై ప్రయాణిస్తోన్న కారుపై కుప్పకూలిన విమానం.. పైలట్‌ మృతి! నలుగురికి గాయాలు
Chile Plane Crash
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 17, 2024 | 4:08 PM

చిలీ, జనవరి 17: చిలీ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ స్తంబానికి విమానం ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్‌ మృతి చెందాడు. చిలీలోని పంగులెమో విమానాశ్రయం (TLX) సమీపంలో ఈ విమానం కూలిపోయింది. సెంట్రల్ చిలీలోని తాల్కాలో ప్రమాదం జరిగింది. మృతి చెందిన పైలట్ స్పెయిన్ వార్డ్ ఫెర్నాండో సోలన్స్ రోబుల్స్ (58)గా గుర్తించారు. విమాన శకలాలు ఓ కారుపై పడటం వల్ల అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. చిలీలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పైలట్ మరణించిన విషయాన్ని ధృవీకరించింది. మృతుడు నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ (CONAF)లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫైర్‌ఫైట‌ర్ విమానం ఫైర్ కంట్రోల్ ఆపరేషన్స్ కోసం ఉపయోగిస్తుంటారు.

CONAF తెలిపిన వివరాల ప్రకారం.. ఐరెస్ టర్బో ట్రష్ విమానం జనవరి 15న సాయంత్రం 4:30 గంటల సమయంలో అగ్ని నియంత్రణ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అయితే ఈ విమానం హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంట‌లు చెల‌రేగాయి. విమానం రెక్కలు రెండు యుటిలిటీ పోల్స్ మధ్య వేలాడుతున్నట్లు కనిపిస్తోన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

విమాన ప్రమాద సయయంలో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. ప్రమాదంపై CONAF దర్యాప్తు చేస్తోంది. ప్రమాదానికి గల కారణమేమిటో తెలుసుకోవడానికి అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ధృవీకరించింది.

మృతి చెందిన పైలట్‌కు అపార అనుభవం ఉందని, ప్రమాదం ఎలా జరిగిందో అర్ధంకావడం లేదని CONAF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టియన్ లిటిల్ మీడియాకు తెలిపారు. ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఆండీస్ స్పా కంపెనీ ఈ విమానాన్ని నడుపుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.