China: చైనాలో భారతీయ ఇంజినీర్‌కు అద్భుత అనుభవం.! భారత పాస్‌పోర్టును గుర్తుపట్టిన చైనా మెషీన్.
ఇటీవల చైనాకు వెళ్లిన ఓ భారతీయ ఇంజినీర్‌కు ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. అక్కడి ఎయిర్‌పోర్టులోని ఫింగర్ ప్రింట్ సెల్ఫ్ కలెక్షన్ మెషిన్ ఆయన భారత పాస్‌పోర్టును గుర్తుపట్టగానే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించింది. చైనాలాంటి దేశంలో హిందీ చూసిన ఆ ఇంజినీర్ ఆశ్చర్యపోయారు. తనకెదురైన అనుభవాన్ని శంతను గోయెల్ నెట్టింట పంచుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఇక్కడి మెషిన్లు తన భారత పాస్‌పోర్టును గుర్తుపట్టి వెంటనే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించాయి అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు.
ఇటీవల చైనాకు వెళ్లిన ఓ భారతీయ ఇంజినీర్‌కు ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. అక్కడి ఎయిర్‌పోర్టులోని ఫింగర్ ప్రింట్ సెల్ఫ్ కలెక్షన్ మెషిన్ ఆయన భారత పాస్‌పోర్టును గుర్తుపట్టగానే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించింది. చైనాలాంటి దేశంలో హిందీ చూసిన ఆ ఇంజినీర్ ఆశ్చర్యపోయారు. తనకెదురైన అనుభవాన్ని శంతను గోయెల్ నెట్టింట పంచుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఇక్కడి మెషిన్లు తన భారత పాస్‌పోర్టును గుర్తుపట్టి వెంటనే హిందీలో సూచనలు ఇవ్వడం ప్రారంభించాయి అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. అనేక మంది తమ సందేహాలను కామెంట్ సెక్షన్లో పంచుకున్నారు. హిందీతో పాటూ ఇతర భారతీయ భాషలు కూడా ఉన్నాయా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శంతను సమాధానమిస్తూ స్క్రీన్‌పై హిందీ మాత్రమే కనిపించిందని వివరించాడు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చైనా అనుసరిస్తున్న విధానాలపై కొందరు ప్రశంసలు కురిపించారు. విదేశీ పర్యాటకులు సొంత దేశంలో ఉన్నామనే భావన కల్పించేలా చైనా సకల సౌకర్యాలూ కల్పిస్తోందని చెప్పుకొచ్చారు.
చైనా విజయానికి కారణం ఇదేనని చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి దేశం ఇదే పంథా అనుసరించాలని కొందరు సూత్రీకరించారు. గత నాలుగేళ్లుగా చైనా ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందని కొందరు నెటిజన్లు రాసుకొచ్చారు. 2019లోనే షాంఘాయ్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి మెషీన్‌ను చూసినట్టు ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. పర్యాటకులకు తెలిసిన భాషల్లో సూచనలు ఇచ్చే యంత్రాలు చైనా వీధుల్లోనూ దర్శనమిస్తాయని కొందరు చెప్పుకొచ్చారు. నేపాల్ నుంచి రోడ్డు మార్గంలో చైనాకు వెళ్లేటప్పుడు ఇలాంటి మెషీన్లు అనేకం చూడొచ్చని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

