Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళనాడులోని ఈ ప్రాంతం మరికొన్ని రోజుల్లో గడ్డకట్టుకుపోతుంది.. ఆందోళనలో పర్యావరణ వేత్తలు

తమిళనాడు ఊటీగా పేరుగాంచిన నీలగిరి కొండ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం కారణంగా అక్కడి స్థానికులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వాతావరణ మార్పుల వల్ల అక్కడి వ్యవసాయం కూడా ప్రభావితం అవుతుంది. పచ్చని పచ్చిక బయళ్ళు మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. దట్టమైన పొగమంచు చుట్టూ పరిసరాలను మంచెత్తింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వల్ల స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు...

Tamil Nadu: తమిళనాడులోని ఈ ప్రాంతం మరికొన్ని రోజుల్లో గడ్డకట్టుకుపోతుంది.. ఆందోళనలో పర్యావరణ వేత్తలు
This Place In Tamil Nadu Is Freezing
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2024 | 3:50 PM

నీల్‌గిరిస్‌, జనవరి 18: తమిళనాడు ఊటీగా పేరుగాంచిన నీలగిరి కొండ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం కారణంగా అక్కడి స్థానికులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వాతావరణ మార్పుల వల్ల అక్కడి వ్యవసాయం కూడా ప్రభావితం అవుతుంది. పచ్చని పచ్చిక బయళ్ళు మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. దట్టమైన పొగమంచు చుట్టూ పరిసరాలను మంచెత్తింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వల్ల స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ విధమైన చలి వాతావరణం అసాధారణమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. దీంతో చాలా చోట్ల స్థానికులు వీధుల్లో మంటలువేసి, వాటి చుట్టూ కూర్చుని తమను తాము వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఉదగమండలంలోని కాంతల్, తలైకుంట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. బొటానికల్ గార్డెన్‌లో 2 డిగ్రీల సెల్సియస్, శాండినాల్లాలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం.

అక్కడ అకాలంగా ఉన్న అసాధారణ చలి వాతావరణంపై స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని నీలగిరి ఎన్విరోమెంట్ సోషల్ ట్రస్ట్ (NEST)కి చెందిన వి శివదాస్ చెబుతున్నారు. చలి తీవ్రత మరింత పెరుగుతోందని, ఇలాంటి వాతావరణ మార్పు నీలగిరికి ప్రాంతంలో సవాల్‌గా మారిందని, దీనిపై అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున తేయాకు పంటలు ఉన్నాయి. చలి తీవ్రత ఈ పంటలను కూడా ప్రభావితం చేస్తుంది. డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆ తర్వాత వచ్చిన చలి కాలం తేయా పంట దిగుమతిపై ప్రభావం చూపిందని స్థానిక తేయాకు కార్మికుల సంఘం కార్యదర్శి ఆర్‌ సుకుమారన్‌ తెలిపారు. ఇది రాబోయే నెలల్లో మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన ఆదోళన వ్యక్తం చేశారు.

మరో వైపు కూరగాయ రైతులు కూడా ఈ అసాధారణ వాతావరణ మర్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలిగాలుల కారణంగా ఉదయం వేళల్తో బయటికి వెళ్లాలంటే దడపుడుతోందని ప్రభుత్వ ఉద్యోగి ఎన్ రవిచంద్రన్ మీడియాకు తెలిపారు. మునుముందు రోజుల్లో నీలగిరి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ విభిన్న వాతావరణ మార్పులపై పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.