UGC NET 2023 Results: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (డిసెంబరు) 2023 పరీక్ష ఫలితాలు శుక్రవారం (జనవరి 19) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు సెక్యూరిటీ పిన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేయుటకు అర్హత సాధించేందుకు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్..

UGC NET 2023 Results: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి
UGC NET 2023 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 19, 2024 | 2:39 PM

ఢిల్లీ, జనవరి 19: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (డిసెంబరు) 2023 పరీక్ష ఫలితాలు శుక్రవారం (జనవరి 19) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు సెక్యూరిటీ పిన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేయుటకు అర్హత సాధించేందుకు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ ప్రతీ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 6 నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో యూజీసీ నెట్‌ పరీక్షను నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 292 నగరాల్లో పరీక్ష జరిగింది. దాదాపు 9,45,918 మంది అభ్యర్థులు యూజీసీ నెట్‌ పరీక్షకు హాజరయ్యారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 10వ తేదీన ఫలితాలు విడుదల కావల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌, చెన్నైలలో పరీక్షను మళ్లీ నిర్వహించడం మూలంగా ఫలితాల వెల్లడి వాయిదా పడింది. తాజాగా ఫలితాలు విడుదల కావడంతో విద్యార్ధులు స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది.

UGC NET December 2023 ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా యూజీసీ నెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ugcnet.nta.ac.in. ఓపెన్‌ చెయ్యాలి.
  • వెబ్‌సైట్‌లో లేటెస్ట్‌ న్యూస్‌ సెక్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో UGC NET December 2023 Result విండోపై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే రిజల్ట్‌ పేస్‌ ఓపెన్‌ అవుతుంది.
  • దరఖాస్తుదారుల అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యురిటీ పిన్‌ నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి.
  • స్క్రీన్‌పై యూజీసీ నెట్‌ 2023 ఫలితాలు కనిపిస్తాయి.
  • ఫలితాలను చెక్‌ చేసుకుని, స్కోర్‌ కార్డు పేజ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

తెలంగాణ ప్రతిభా పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే!

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్‌ సంబరాల్లో భాగంగా పాఠశాల స్థాయి ప్రతిభా పరీక్ష ఈ రోజు (జనవరి 19) జరగాల్సి ఉంది. అయితే దానిని కొన్ని కారణాల వల్ల జనవరి 22వ తేదీకి వాయిదా వేసినట్లు జేవీవీ ప్రతినిధులు తెలిపారు. అయితే, మండల స్థాయి పరీక్షలు ముందుగా నిర్ణయించిన ప్రకారంగా యథావిధిగా జనవరి 27, ఫిబ్రవరి 3న జరుగుతాయని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఆయా ప్రభుత్వ, ప్రెవేట్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 97032 95685కు ఫోన్‌ ద్వారా సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.