AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Recruitment: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..పెద్ద ఎత్తున దరఖాస్తులు.. ఒక్కో ఉద్యోగానికి 83 మంది పోటీ

ఉత్తర్‎ప్రదేశ్‎లో నిరుద్యోగులు కదం తొక్కారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 60,244 పోస్టులకు గానూ దాదాపు 50 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్లో ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు అధికారులు. ఉత్తర్‎ప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ అందుకున్న ఆన్‎లైన్ రిజిస్ట్రేషన్లలో ఇదే అతిపెద్దది.

Police Recruitment: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..పెద్ద ఎత్తున దరఖాస్తులు.. ఒక్కో ఉద్యోగానికి 83 మంది పోటీ
Up Police Job Notification
Srikar T
|

Updated on: Jan 19, 2024 | 1:44 PM

Share

ఉత్తర్‎ప్రదేశ్‎లో నిరుద్యోగులు కదం తొక్కారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 60,244 పోస్టులకు గానూ దాదాపు 50 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్లో ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు అధికారులు. ఉత్తర్‎ప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ అందుకున్న ఆన్‎లైన్ రిజిస్ట్రేషన్లలో ఇదే అతిపెద్దది. 2009లో ఈ బోర్డు ఏర్పాడినట్లు చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం ఇదే తొలిసారి. ఇందులో 15లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12 వేల మంది రిజర్వేషన్ క్యాటగిరీకి చెందని వారిగా గుర్తించారు. గత ఏడాది డిశంబర్ 27న ప్రారంభమైన ఈ ప్రక్రియ యువత అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వీలుగా మారింది. ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసింది. దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు సర్థుబాట్లు, దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు జనవరి 20 వరకూ గడువు ఇచ్చింది ప్రభుత్వం.

ప్రభుత్వం విడుదల చేసిన 60,244 పోస్టులకు గాను 50.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో అభ్యర్థికి పోటీగా 83 మంది ఉన్నారు. ఈ నోటిఫికేషన్‎కి దాదాపు 32 లక్షల నోటిఫికేషన్లు వస్తాయని భావించగా ఇంత మొత్తంలో రావడంతో అధికారులు షాక్‎కి గురయ్యారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి 2024 ఫిబ్రవరి 18న పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం 6500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్రాత పరీక్షలను రెండు, మూడు దఫాలుగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‎కి పురుషులు 35 లక్షల మంది, మహిళలు 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.

పురుషుల విభాగంలో ఒక్కో అభ్యర్థికి పోటీదారునిగా 66 మంది ఉండగా.. మహిళల క్యాటగిరీలో ఒక్కో పోస్టుకు 135 మంది పోటీ పడుతున్నారు. దీనిని బట్టి భవిష్యత్తులో మహిళా పోలీసు ఉద్యోగులు ఎక్కువగా ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నందున పరీక్షలు నిర్వహించడం అధికారులకు పెద్ద సవాలుగా చెప్పాలి. అందుకే జోన్ పరిధిలో 4844 ఎగ్జామ్ సెంటర్లను, కమిషనరేట్ పరిధిలో 1640 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అత్యధికంగా 832 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొని రాకూడదని సూచించింది. ఒకవేళ తీసుకొస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..