AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cotching Centers: ఈ వయసు పైబడిన వారికే కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇవ్వాలి.. కేంద్రం కీలక ఆదేశాలు..

దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ఇతర ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌లకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్‌ సెంటర్‌లో చేర్చుకోవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Cotching Centers: ఈ వయసు పైబడిన వారికే కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇవ్వాలి.. కేంద్రం కీలక ఆదేశాలు..
Cotching Centers
Srikar T
|

Updated on: Jan 19, 2024 | 8:26 AM

Share

ఢిల్లీ, జనవరి 19: దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ఇతర ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌లకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్‌ సెంటర్‌లో చేర్చుకోవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ లోని పలు కోచింగ్ సెంటర్లలో ర్యాంకుల కోసం కోచింగ్ సెంటర్లు పెడుతున్న ఒత్తిడి కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు విద్యార్థులు. దీంతో పాటు సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్ధులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పలు సూచనలు చేస్తూ కీలక ఆదేశాలు జారీచేసింది.

ముఖ్యమైన సూచనలు.. కీలక ఆదేశాలు..

  • కోచింగ్‌ తీసుకునే విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించింది.
  • శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోకూడదు.
  • సిబ్బంది అర్హత, కోచింగ్‌ సెంటర్‌ వివరాలు, శిక్షణ ఇచ్చే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్‌ గురించి కచ్చితమైన సమాచారం కలిగి ఉండాలి.
  • ఈ వివరాలన్నీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
  • విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
  • ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్‌ చేయాలి.
  • శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్‌ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.
  • కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.
  • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు అందించాలి.
  • విద్యుత్‌, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు, భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి.
  • అధిక ఫీజులు కాకుండా న్యాయంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఫీజు చెల్లింపు రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండేలా చూడాలి.
  • ఒకవేళ పైన పేర్కొన్న మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుందని హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..