Jyotiraditya Scindia: ఊహించని ప్రాంతాలకు విమాన సర్వీసులు.. 2030 నాటికి రెట్టింపు కానున్న ప్రయాణికుల సంఖ్య..

Wings India 2024: వింగ్స్ ఇండియా 2024 ను ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రసంగించారు. భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 2030 నాటికి 300 మిలియన్లకు చేరుకుంటుందని, 2023లో 153 మిలియన్ల నుండి దాదాపు రెండు రెట్లు పెరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.

Jyotiraditya Scindia: ఊహించని ప్రాంతాలకు విమాన సర్వీసులు.. 2030 నాటికి రెట్టింపు కానున్న ప్రయాణికుల సంఖ్య..
Wings India 2024
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 18, 2024 | 7:11 PM

Wings India 2024: ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోకి హైదరాబాద్‌ మరోసారి వేదిక అయింది. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనా కార్యక్రమం వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (MOCA) మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండియన్ ఇండస్ట్రీ (FICCI) ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో 4రోజుల పాటు (జనవరి 21వరకు ) వింగ్స్ ఇండియా2024 భారీ ఎయిర్ షో నిర్వహించనున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ప్రపంచంలోనే అతి పెద్ద విమానమైన బోయింగ్‌తో పాటు పలు రకాల విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు కంపెనీల ఫ్లైట్స్, జెట్స్, హెలికాప్టర్స్ ఈ షోలో పాల్గొన్నాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈవెంట్లో అతి పెద్ద విమానం బోయింగ్ ఎయిర్ ఇండియా, ఎయిర్ బస్ సారంగ టీం హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

వింగ్స్ ఇండియా 2024 ను ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రసంగించారు. భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 2030 నాటికి 300 మిలియన్లకు చేరుకుంటుందని, 2023లో 153 మిలియన్ల నుండి దాదాపు రెండు రెట్లు పెరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 మార్కెట్లలో ఒకటిగా కొనసాగుతుందని.. దశాబ్దం నాటికి 3%-4% నుండి 10%-15%కి పెరుగుతుందన్నారు. పౌర విమానయాన రంగం వృద్ధి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం “సామర్థ్యాలను సృష్టించడం, అడ్డంకులను తొలగించడం, విధానాలను సరళీకృతం చేయడం” అనే విధానాలతో ముందుకువెళ్తోందని సింధియా తెలిపారు.

దేశంలో ప్రతి ఒక్క సామాన్యుడు విమాన ప్రయాణం చేసేలా ఉడాన్ యోజన కార్యక్రమాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిందని సింధియా తెలిపారు. అనేక చిన్న చిన్న నగరాలకు సైతం విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎప్పుడూ ఊహించని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులో తెచ్చామన్నారు. ప్రయాణికుల సంఖ్య ఘననీయంగా పెరిగిందని.. 15శాతం కంటే ఎక్కువ ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారన్నారు. 15కోట్ల ప్రయాణికులను రెండింతలు చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచంలో డొమెస్టిక్ ప్రయాణంలో భారత్ మొదటి స్థానంలో ఉందని జ్యోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు. డొమెస్టిక్, అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇప్పటికే 5స్థానంలో భారత్ ఉందన్నారు. 2030వరకు ముడో అతి పెద్ద డొమెస్టిక్, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసే దేశంగా భారత్ అగ్రగ్రామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. విమానయాన సంస్థలు సర్వీసులను పెంచేందుకు వందలాది విమానాలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. విమానయాన సంస్థలు హైదరాబాద్ లో తమ కంపెనీలను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయని తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో విమానాల తయారీకి ఆర్డర్ లు ఇచ్చాయని గుర్తుచేశారు.

కాగా.. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు.. ఈ రంగంలోని అవకాశాలపై వ్యాపారవేత్తలకు, పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..