Video : ఏయ్..! నా సామిరంగ.. సీటుకోసం చెప్పులతో పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు
సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం కొట్లాడుకున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తెలంగాణాలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపించిన తర్వాత ఇలాంటి సంఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట వద్ద బస్సులో మహిళలు రెచ్చిపోయారు. ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం కొట్లాడుకున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తెలంగాణాలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపించిన తర్వాత ఇలాంటి సంఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మగాళ్లకు సీట్లు కూడా దొరకడం లేదు. ఇంకొన్ని చోట్ల కండక్టర్లను కూడా బయటకు దింపేసిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సీటు కోసం ఏకంగా ఇద్దరు మహిళలు చెప్పులతో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.