Sleep Apnea: నిద్రలో గురక వస్తోందా? జాగ్రత్త.. గుండె సమస్యలు పొంచి ఉన్నట్లే

రాత్రి నిద్రలో చాలా మందికి గురక వస్తుంటుంది. సాధారణంగా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గురక వచ్చే వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇది కలిగిస్తుంది. 2,000 మందిపై జరిపిన ఓ అధ్యయనంలో నోటి ద్వారా గాలి పీల్చేవారు ఇతరులకన్నా గురక వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ ఉన్నట్లు కనుగొన్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.13% మంది ప్రజలు సాధారణంగా..

Sleep Apnea: నిద్రలో గురక వస్తోందా? జాగ్రత్త.. గుండె సమస్యలు పొంచి ఉన్నట్లే
Sleep Apnea
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2024 | 9:18 PM

రాత్రి నిద్రలో చాలా మందికి గురక వస్తుంటుంది. సాధారణంగా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గురక వచ్చే వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇది కలిగిస్తుంది. 2,000 మందిపై జరిపిన ఓ అధ్యయనంలో నోటి ద్వారా గాలి పీల్చేవారు ఇతరులకన్నా గురక వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ ఉన్నట్లు కనుగొన్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.13% మంది ప్రజలు సాధారణంగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. అయితే, నిద్రపోతున్నప్పుడు 18 శాతం మంది ప్రజలు నోటి ద్వారా గాలి పీల్చుకుంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విధంగా రాత్రిపూట నిద్రలో గురక వచ్చేవారిలో ముగ్గురిలో ఒకరు (31%) సాధారణంగా నాసికలో ఇబ్బందులు అనుభవిస్తున్నారు.

మరోవైపు, ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకునే వ్యక్తుల్లో నాసికా రద్దీని సగం కంటే తక్కువ మంది ఎదుర్కొంటున్నట్లు తేలింది. నాసికా రద్దీని ఎదుర్కొంటున్న వారిలో 38 శాతం మంది ప్రజలు సరిగ్గా నిద్రపోరు. ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరికి ముక్కు కారటం సమస్యగా ఉంటుంది. 31 శాతం మంది సైనస్ ఒత్తిడి, నొప్పితో బాధపడుతుంటారు. మరో 31 శాతం మంది ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. నోటితో శ్వాస తీసుకోవడం వల్ల శరీరానికి తక్కువ ఆక్సిజన్ అందుతుంది. దీని వల్ల పగటిపూట నిద్రపోవడం, మరింత అలసట కలుగుతుంది. ఇది నోరు పొడిబారడానికి కారణమవుతుంది. ఇది దంత క్షయం, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. వీరికి గుండె సమస్యలు కూడా తలెత్తుతాయంటున్నారు నిపుణులు.

నోటి శ్వాస, నాసికా రద్దీని తగ్గించడానికి సెలైన్ స్ప్రే లేదా నాసల్ డీకోంగెస్టెంట్ ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు తలను ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. అంటే తల కింద ఒకటి లేదా 2 దిండ్లు పెట్టుకుని పడుకోవాలి. ఇలా చేయడం ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫలితంగా ముక్కు ద్వారా గాలిపీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గురక సమస్య కూడా తలెత్తదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.