Barrelakka Video: ‘బర్రెలైనా కాచుకో..’ బర్రెలక్కను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు! కారణం ఇదే

బర్రెలక్క అలియాస్‌ కర్ని శిరీష ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చేసిన కర్నె శిరీష సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువైంది. నిరుద్యోగుల తరఫున నామినేషన్‌ వేసి, ఏకంగా 5,754 ఓట్లు రాబట్టింది. ఎన్నికల సమయంలో తనదైన రీతిలో ప్రచారం సాగించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆమెకు అండగా నలిచారు. ఎన్నికల అనంతరం..

Barrelakka Video: 'బర్రెలైనా కాచుకో..' బర్రెలక్కను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు! కారణం ఇదే
Barrelakka
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2024 | 7:59 AM

నాగర్‌కర్నూల్‌, జనవరి 24: బర్రెలక్క అలియాస్‌ కర్ని శిరీష ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చేసిన కర్నె శిరీష సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువైంది. నిరుద్యోగుల తరఫున నామినేషన్‌ వేసి, ఏకంగా 5,754 ఓట్లు రాబట్టింది. ఎన్నికల సమయంలో తనదైన రీతిలో ప్రచారం సాగించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆమెకు అండగా నలిచారు. ఎన్నికల అనంతరం చాలా మంది బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఆరా తీశారు. సోషల్ మీడియా స్టార్‌ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అందరికీ షాక్‌ ఇచ్చింది. ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్‌ అంతాఇంతా కాదు. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ నుంచి ఆమె అఫిడవిట్‌ను సుమారు లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని బట్టి ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడం బర్రెలు కాసుకుంటున్నానంటూ.. ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఆమెపై కేసు కూడా పెట్టింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని బర్రెలక్క నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా వేలాది మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది.

అయితే తాజాగా ఆమె చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నేను ఒక గురువు గారి గురించి రెగ్యులర్‌గా చెబుతా కదా.. ఆ గురువు గారిని నేను కలిశాను. వీడియో తీసి చూపిద్దామని అనుకున్నా. కానీ వీలు కావడం లేదు. గురువు గారు చాలా బిజీగా ఉంటారు. చాలా సమస్యలతో బాధపడుతున్న వారు గురువు గారి దగ్గరికి వచ్చి సమస్యలను పరిష్కరించుకొని వెళ్తున్నారు. మీ లైఫ్‌లో కూడా ప్రేమ,పెళ్లి, అనారోగ్యం వంటి సమస్యలతో సతమతం అవుతున్నవారు.. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయండి. గురువు గారు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జోతిష్యం చెబుతారు. చాలా మంది టైంపాస్ కోసం కాల్ చేస్తున్నారట. నా నంబర్ అడుగుతున్నారట. గురువు గారి దగ్గర నా నంబర్ లేదు. గురువు గారికి కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. గురువు గారి టైం వేస్ట్ చేసుకోకండి. ఆయన దగ్గరకు చాలా మంది వస్తుంటారు’ అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియోపై ప్రత్యేక వశీకరణ స్పెషలిస్ట్.. అంటూ ఆ గురువు గారి సంబంధించిన విషయాలు కనిపించాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇలాంటివి ప్రొమోట్‌ చేస్తే నీ మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. నీ నియోజక వర్గంలోని ప్రజల్ని వాస్తవాంశాలు, విద్య వంటి అంశాలపై ఎడ్యుకేట్‌ చేయడానికి ప్రయత్నించు అంటూ ఓ నెటిజన్‌ సూచించగా.. బర్రెలైనా కాచుకోగానీ ఇలాంటివి ప్రమోట్‌ చేయకంటూ శుద్ధులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో