MP Ranjith Reddy:: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ నాయకుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లో నివసించే మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి జనవరి 17న ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేశారని తెలిపారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు, సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా, అసభ్యకరంగా మాట్లాడారన్నారు.

Follow us
Srikar T

|

Updated on: Jan 24, 2024 | 1:10 PM

బీఆర్ఎస్ నాయకుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లో నివసించే మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి జనవరి 17న ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేశారని తెలిపారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు, సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా, అసభ్యకరంగా మాట్లాడారన్నారు. రంజిత్ రెడ్డి తీరుపై జనవరి 20న విశ్వేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీష్.. ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేసే విషయంలో న్యాయ సలహా తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టు పోలీసులకు కీలక ఆదేశాల జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎంపీపై కేసు నమోదు అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..