AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మైనార్టీ గురుకుల పాఠశాలలో వెలుగులోకి దారుణం.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. వాచ్ మెన్ గా పనిచేస్తున్న నిరంజన్ అనే వ్యక్తి ఇంటర్ చదువుతున్న మైనర్ విద్యార్థినితో ప్రేమ వ్యవహరం కలకలం రేపింది. మాయమాటలు చెప్పి మైనర్ విద్యార్థినిని గర్భం దాల్చేలా చేశాడు దుర్మార్గుడు.

Crime News: మైనార్టీ గురుకుల పాఠశాలలో వెలుగులోకి దారుణం.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
Image Used For Representational
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jan 23, 2024 | 11:08 PM

Share

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. వాచ్ మెన్ గా పనిచేస్తున్న నిరంజన్ అనే వ్యక్తి ఇంటర్ చదువుతున్న మైనర్ విద్యార్థినితో ప్రేమ వ్యవహరం కలకలం రేపింది. మాయమాటలు చెప్పి మైనర్ విద్యార్థినిని గర్భం దాల్చేలా చేశాడు దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన మైనర్ విద్యార్థిని కొల్లాపూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే అదే గురుకుల పాఠశాలలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న నిరంజన్ ఆ అమ్మాయిపై కన్నేశాడు. గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో మైనర్ వెంటపడి బుట్టలో వేసుకున్నాడు.

సంక్రాంతి సెలవులతో వెలుగులోకి అసలు విషయం

ఇటీవలే గురుకుల పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో వాచ్ మెన్, మైనర్ విద్యార్థిని ప్రేమవ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెలవులు ప్రకటించడంతో ఇంటికి తీసుకెళ్దామని వచ్చిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. ప్రేమ వ్యవహారంతో పాటు గర్భం దాల్చడంతో ఇంటికి వెళ్లలేక వాచ్ మెన్ తో కలిసి గురుకుల పాఠశాల నుంచి పరార్ అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

పరారీలో ఉన్న ఇద్దరిని గుర్తించిన పోలీసులు వాచ్ మెన్ నిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై ఫోక్సో, 376 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక కొల్లాపూర్ కు చెందిన వాచ్ మెన్ నిరంజన్ ఓ రాజకీయ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ.. గురుకుల పాఠశాలలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. గతంలో నిందితుడికి రెండు పెళ్లిళ్ళు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంక్రాంతి సెలవుల్లోనే మొత్తం వ్యవహారం బయటపడినా, విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వాచ్ మెన్, మైనర్ స్టూడెంట్ ప్రేమ వ్యవహారంతో కొల్లాపూర్ గురుకుల పాఠశాలలో కలకలం రేగింది. దీంతో మైనార్టీ గురుకుల అధికారులు పాఠశాలను సందర్శించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోవైపు దారుణ ఘటన తెలుసుకున్న మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…