AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8నెలల క్రితమే నగరానికి.. అంతలోనే అనంతలోకాలకు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని మింగేసిన రోడ్డుప్రమాదం

ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి గ్యాస్ సిలిండర్ తీసుకొస్తానని బయల్దేరాడు.. తన స్కూటీపైనే వెళ్లాడు. డీసీఎం వ్యాన్ డీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

8నెలల క్రితమే నగరానికి.. అంతలోనే అనంతలోకాలకు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని మింగేసిన రోడ్డుప్రమాదం
Accident
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jan 23, 2024 | 11:58 PM

Share

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందాడు.. హైదరాబాద్‌ రామచంద్రపురం ప్రాంతానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ రామినేని మహేష్‌ బాబు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన  మహేష్‌ బాబు మృతి పట్ల అతని కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేష్ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు గుంటూరుకు చెందిన రామినేని మహేష్ బాబు 8 నెలల క్రితం ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చి రామచంద్రపురంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి గ్యాస్ సిలిండ్ తీసుకొస్తానని బయల్దేరాడు. తన స్కూటీపైనే వెళ్లాడు.

ఈ క్రమంలోనే చందానగర్ మెయిన్ రోడ్ లో స్కూటీపై వెళ్తున్న మహేష్ ని  మృత్యు శకటం రూపంలో వచ్చిన  DCM వెహికల్ ఢీకొట్టింది దీంతో మహేష్ బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి