Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir Optical Illusion: అయోధ్య అద్భుతం..! రామ మందిర నిర్మాణంలోనే జై శ్రీరామ్‌ అనే నినాదం ఉంది.. దగ్గరగా చూస్తే మీకూ కనిపిస్తుంది..

అయోధ్యలోని భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ ఆలయంలో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి. రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాల మీద అనేక రకాల దేవతమూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రించారు. రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది. ఇక్కడి సింగ్ ద్వార్ గుండా 32 మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

Ram Mandir Optical Illusion: అయోధ్య అద్భుతం..! రామ మందిర నిర్మాణంలోనే జై శ్రీరామ్‌ అనే నినాదం ఉంది.. దగ్గరగా చూస్తే మీకూ కనిపిస్తుంది..
Ram Mandir Optical Illusion
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 23, 2024 | 7:25 PM

Ram Mandir Optical Illusion: ఎట్టకేలకు ఆ శ్రీరాముడి పుట్టినిల్లు.. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ రామాలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అపూర్వమైన ఈ వేడుక కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫ్రాన్స్‌, న్యూయార్క్‌లోనే కాకుండా పాకిస్థాన్‌లో కూడా రామమందిర ఉత్సవాల సందర్భంగా సంతోషం, ఉత్సవ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రామమందిరానికి సంబంధించిన వందలాది ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రామ మందిరానికి సంబంధించిన ఒక ఫోటో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఫోటోను చూస్తే అద్భుత అనుభూతిని మేల్కొల్పుతుంది. ఇప్పటివరకు ఈ రీల్‌ను కోట్ల మంది వీక్షించగా, ఇప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీకు ఆప్టికల్ ఇల్యూషన్ గురించి తెలిసే ఉండాలి. దీని అర్థం మీరు ముఖాముఖిగా చూస్తే, అది ఒక నిర్దిష్ట మార్గంలో కనిపిస్తుంది. కానీ, మీరు అదే విషయాన్ని వేరొక కోణం నుండి చూస్తే, భిన్నమైన కోణంలో మాత్రమే కాకుండా… దాని పూర్తి అర్థం కూడా మన కల్లముందు ఉద్భవిస్తుంది. అభ్యర్థుల వైఖరి, సృజనాత్మకతను తెలుసుకోవడానికి కొన్ని పోటీ పరీక్షలలో ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ రామాలయ చిత్రం కూడా ఆప్టికల్ ఇల్యూషన్‌లో భాగమే అని చెప్పవచ్చు. ఇందులో పేర్కొన్నట్లుగా రామ మందిరం అటువంటి దృక్కోణం నుండి కనిపించింది. మీరు మీ కళ్ళు కొద్దిగా దగ్గరగా పరిశీలించి చూసినట్లయితే రామాలయ నిర్మాణంలో మీరు ఆ రాముని పేరును గమనిస్తారు.. ఇదిలా ఉంటే, ఈ వైరల్ వీడియోపై చాలా మంది వ్యాఖ్యానిస్తూ..ఇది నిజంగా అద్భుతం అని అన్నారు. ఈ రీల్‌పై పలువురు జై శ్రీరామ్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, అయోధ్యలోని భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామ మందిరం. ఈ రామ మందిరం సాంప్రదాయ నాగర్‌ శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఈ మందిరాన్ని నిర్మించారు. మందిరం మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి ఐదేళ్ల బాలరాముడిగా (శ్రీరామ్‌ లల్లా విగ్రహం) దివ్య దర్శనం కలుగుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ్‌ దర్బార్‌ ఉంటుంది.

ఈ ఆలయంలో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి. రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాల మీద అనేక రకాల దేవతమూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రించారు. రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది. ఇక్కడి సింగ్ ద్వార్ గుండా 32 మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..