AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: అందమైన బీచ్‌లో అద్భుత దృశ్యం.. ఒకేచోట కనిపించిన మంచు, ఇసుక, సముద్ర సంగమం

ఒకేచోట మంచు, ఇసుక తిన్నెలు, సముద్రం కలిస్తే ఎలా ఉంటుందో మనకు ఊహకు కూడా అందని విషయం.. మరపురాని, అద్భుతమైన, నమ్మశక్యం కాని ఫోటోను జపనీస్ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇది అక్కడి సముద్రం పశ్చిమ తీరంలో కనిపించిన అద్భుతమైన చిత్రం. ఇది చూసిన నెటిజన్లు ప్రపంచాన్నే మరిచిపోతున్నామంటూ స్పందిస్తున్నారు.

Viral Post: అందమైన బీచ్‌లో అద్భుత దృశ్యం.. ఒకేచోట కనిపించిన మంచు, ఇసుక, సముద్ర సంగమం
Snow Sand And Sea
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2024 | 5:55 PM

Share

ప్రపంచంలోని ప్రతి మూలన ప్రకృతి తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది. మనం ఇళ్లు, ఆఫీసు వదిలి అలా ప్రకృతిలోకి అడుగుపెడితే.. మన చుట్టూ అనేక ఆవిష్కరణలు, అద్భుతాలు కనువిందు చేస్తాయి. అలాంటి ప్రకృతి అద్భుతాలు చూసి ఎవరైనా సరే తమను తాము మైమరచి పోవాల్సిందే.. అలాంటి కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రకృతి దృశ్యాలు చూసి నోరెళ్లబెట్టిన క్షణాలు, నోట మాటరాకుండా పెదవి మెదపకుండా ఉండిపోయేలా చేస్తుంటాయి. అలాంటిదే మీ కళ్ళను మీరు నమ్మలేని దృశ్యం ఒకటి ఇప్పుడు నెటిజన్లను కట్టిపడవేస్తుంది. ప్రకృతిలో కనిపెట్టిన ఈ ఆవిష్కరణ చూస్తే మనం భూమిపై ఉన్నామని నమ్మలేకపోతున్నాం. సినిమాలోని సన్నివేశాలను సైతం తలదన్నేలా చేసే అద్భుతాలు ఈ ప్రకృతిలో అనేకం కనిపిస్తాయి. అలాంటి మన్మోహన దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మంచు, ఇసుక, సముద్రం ఒకేచోట కలుసుకున్న అద్భుత ఆవిష్కృతం కనిపిస్తుంది. కళ్లు చెదిరే ఈ దృశ్యాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

మరపురాని, అద్భుతమైన, నమ్మశక్యం కానిది ఇది..!

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ప్రపంచం చాలా మందిని షాక్‌ అయ్యేలా, ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక్కడ మీరు అనేక వీడియోలు, ఫోటోలను చూస్తారు. అది ఇన్‌స్టగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఏదైనా మనకు తెలియని లక్షలాది విషయాలు ఉన్నాయి. ప్రకృతికి సంబంధించిన అసంఖ్యాక వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోలు మీకు ఆనందకరమైన షాక్ ఇస్తాయి. మీ హృదయాన్ని సంతోషపరిచే అద్భుతాలు ప్రపంచం వెనుక కూడా జరుగుతాయి. ఇక్కడ కనిపించిన దృశ్యం కూడా అలాంటి అరుదైనదే.

ఒకేచోట మంచు, ఇసుక తిన్నెలు, సముద్రం కలిస్తే ఎలా ఉంటుందో మనకు ఊహకు కూడా అందని విషయం.. మరపురాని, అద్భుతమైన, నమ్మశక్యం కాని ఫోటోను జపనీస్ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇది జపాన్ పశ్చిమ తీరంలో కనిపించిన అద్భుతమైన చిత్రం. ఇది చూసిన నెటిజన్లు ప్రపంచాన్నే మరిచిపోతున్నామంటూ స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..