AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రౌన్ రైస్ వర్సెస్ వైట్ రైస్.. ఏ బియ్యం తింటే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా..?

వీటిని రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు ఎలాంటి మందులు వాడకుండానే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ అన్నం శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ బ్రౌన్ అండ్ రెడ్ రైస్ తినడం ఆరోగ్యానికి

బ్రౌన్ రైస్ వర్సెస్ వైట్ రైస్.. ఏ బియ్యం తింటే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా..?
Brown Rice Vs White Rice
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2024 | 3:39 PM

Share

సాధారణంగా అందరూ వైట్ రైస్ తింటారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో బ్రౌన్‌ రైస్‌, రెడ్‌ రైస్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏ బియ్యం మనకు ఆరోగ్యానిస్తుందో పరిశీలించినట్టయితే.. వైట్ రైస్‌లో అధిక శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వైట్‌రైస్‌ తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఎక్కువగా పాలిష్ చేయ డం వల్ల ఈ బియ్యంలో పోషకాలు తగ్గుతాయి. దీని వల్ల ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా పాలిష్ చేసిన, వైట్ రైస్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ధాన్యం నుండి పొట్టు వేరు చేసిన తర్వాత వచ్చే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇది గోధుమ రంగులో కనిపిస్తుంది. ఈ అన్నం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు, గుండెజబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రెడ్ రైస్.. ఈ బియ్యం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ రంగుకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని తీసుకోవడం ద్వారా ఐరన్, విటమిన్లు లభిస్తాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. అందుకే డాక్టర్లు కూడా వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఆరోగ్యకరం అంటున్నారు. వీటిని రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు ఎలాంటి మందులు వాడకుండానే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ అన్నం శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ బ్రౌన్ అండ్ రెడ్ రైస్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, షుగర్ సమస్య ఉన్నవారు చెబుతున్నారు. ఈ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ రైస్ తింటే ఆరోగ్యంగా జీవించాలనుకునే వారికి కచ్చితంగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..