Hyderabad: వీఆర్‌ఎస్‌ తీసుకున్న ప్రిన్సిపల్‌.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

థ్యాంక్యూ మేడమ్‌ అంటూ బ్యాండ్‌ బాజాలతో వీడ్కోలు పలికారు. మెడికల్‌ కాలేజీ అభివృద్ధికి శశికల ఎంతో కృషి చేశారని విద్యార్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తకీవుద్ధీన్‌, డాక్టర్‌ కిరణ్మయి, డాక్టర్‌ జయ, డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ సుమలత, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ భవానీ వేణుగోపాల్‌ రెడ్డి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Hyderabad: వీఆర్‌ఎస్‌ తీసుకున్న ప్రిన్సిపల్‌.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
Dr P Shashikala Reddy, principal of Osmania Medical College
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 23, 2024 | 10:03 PM

తమకు ఉత్తమ విద్యను అందించిన ఉపాధ్యాయులు పాఠశాలను వదిలి వెళ్తుంటే వారికి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలకడం చూస్తుంటాం.. తాజాగా ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శశికళ రెడ్డి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవడంతో ఆమెను గుర్రపు బండిపై ర్యాలీగా తీసుకెళ్లారు. థ్యాంక్యూ మేడమ్‌ అంటూ బ్యాండ్‌ బాజాలతో వీడ్కోలు పలికారు. మెడికల్‌ కాలేజీ అభివృద్ధికి శశికల ఎంతో కృషి చేశారని విద్యార్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తకీవుద్ధీన్‌, డాక్టర్‌ కిరణ్మయి, డాక్టర్‌ జయ, డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ సుమలత, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ భవానీ వేణుగోపాల్‌ రెడ్డి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందిన ఉస్మానియా మెడికల్‌ కలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళ రెడ్డికి కళాశాల విద్యార్థులు, తోటి విద్యార్థులు ఉద్యోగులు కళాశాల ఆవరణలో పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్‌ శశికళ రెడ్డిని గుర్రపు బగ్గీపై ఊరేగించి పూల వర్షం కురిపించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. నాగేందర్‌ మాట్లాడుతూ..శశికళ రెడ్డి ఆరేళ్లలో కళాశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూఇదే కళాశాలలో చదువుకుని ఇదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..