AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir: రామమందిరానికి విరాళాలు ఇచ్చిన నటీ నటులు వీరే..

రామమందిర నిర్మాణానికి ఇప్పటికే చాలా మంది విరాళాలు ఇచ్చారు. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, గుర్మీత్ చౌదరితో సహా చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆలయ నిర్మాణానికి సహకరించారు. అయితే, రామమందిరానికి అనేక మంది నటీనటులు సైతం తమ వంతు విరాళం అందించారు..

Ram Mandir: రామమందిరానికి విరాళాలు ఇచ్చిన నటీ నటులు వీరే..
Film Celebreties Donated Money To Temple
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2024 | 8:10 PM

Share

అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూసిన యావత్‌ దేశ ప్రజలు, రామ భక్తులు పులకించిపోయారు. ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేశం దాటి ప్రపంచ వ్యాప్తం నుంచి రామమందిర నిర్మాణానికి విరాళాలు వచ్చి చేరాయి. కాగా, రామ మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 1,100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. రామమందిర నిర్మాణానికి ఇప్పటికే చాలా మంది విరాళాలు ఇచ్చారు. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, గుర్మీత్ చౌదరితో సహా చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆలయ నిర్మాణానికి సహకరించారు. అయితే, రామమందిరానికి ఏ నటీనటులుఎంత విరాళం ఇచ్చారో తెలుసా?

అనుపమ్ ఖేర్:

బాలీవుడ్ నటుడు కాశ్మీరీ ఫైల్స్ ఫేమ్ అనుపమ్ ఖేర్ గత అక్టోబర్‌లో అయోధ్యను సందర్శించిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. రామ్ మందిర్ నిర్మాణ స్థలంలో రికార్డ్ చేసిన క్లిప్‌ను కూడా నటుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి ఇటుకలు రావడం తన అదృష్టమన్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్:

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ రూ. 30 లక్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ముఖేష్ ఖన్నా :

నటుడు ముఖేష్ ఖన్నా ఫిబ్రవరి 2021లో ఆలయ నిర్మాణం కోసం రూ. 1.1 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు.

ప్రణిత సుభాష్:

నటి ప్రణిత సుభాష్ జనవరి 12, 2021న అయోధ్య రామమందిర నిధి అంకితం ప్రచారానికి నేను రూ.1 లక్ష విరాళం ఇస్తున్నట్లు పేర్కొంటూ ఒక వీడియోను పోస్ట్ చేసారు. అలాగే మీరందరూ చేయి చేయి కలిపి పాల్గొనవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు.

అక్షయ్ కుమార్:

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రామమందిరానికి విరాళం ఇచ్చారు. జనవరి 2021లో, నటుడు ఆలయ నిర్మాణ పనుల కోసం విరాళాల కోసం విజ్ఞప్తి చేస్తున్న వీడియోను కూగా గతంలో షేర్‌ చేశారు.

మనోజ్ జోషి:

తెలిసిన సమాచారం ప్రకారం, మనోజ్ జోషి రామమందిరానికి విరాళం అందించినట్లు సమాచారం.

హేమ మాలిని:

తెలిసిన సమాచారం మేరకు..నటి హేమ మాలిని కూడా ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారు. అయితే ఎంత మొత్తం ఇచ్చారనేది మాత్రం వెల్లడించలేదు.

గుర్మీత్ చౌదరి:

జనవరి 2021లో, గుర్మీత్ చౌదరి కూడా విరాళం ఇచ్చినట్లు తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..