Agricultural Mela : పూలు, పండ్లతో రామమందిర నిర్మాణం.. వ్యవసాయ మేళాలో డ్రోన్ ఆకర్షణ..ఎక్కడంటే..

కర్ణాటకలోని విజయపూర్ జిల్లాలో మూడు రోజుల పాటు వ్యవసాయ జాతర నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పూలు, పండ్ల ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. పూలు, పండ్లతో తయారు చేసిన శ్రీరామ మందిర ఆవిష్కరణ అందరి దృష్టిని ఆకర్షించింది. వివిధ రకాల పుష్పాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అయోధ్య రామమందిర గోపురం ప్రతిరూపం, బత్తాయి, నిమ్మకాయలలో తయారు చేసిన శివలింగం ప్రధాన ఆకర్షణలు.

Jyothi Gadda

|

Updated on: Jan 22, 2024 | 8:28 PM

గత వారం, పది రోజులుగా నగరంలోని విజయపుర శ్రీ సిద్దేశ్వర ఆలయ జాతర వైభవంగా జరిగింది. జాతరలో పాల్గొన్న పంట నష్టపోయిన రైతులకు ఈ కృషి మేళా పథకం డబుల్ ధమాకా లాంటిది. అందుకు కారణం ఈ ఏడాది జిల్లాలో దారుణమైన కరువు నెలకొంది. కరువు మధ్య కూడా కృషి మేళా నిర్వహించడం పట్ల జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1 / 5
రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో వ్యవసాయ మేళా నిర్వహించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసిన రామమందిరం గోపురం పూలతో వికసిస్తోంది. నిమ్మకాయతో తయారు చేసిన శివలింగం మరింతగా ప్రజల్ని ఆకట్టుకుంది. డ్రోన్ ద్వారా సర్వే, రసాయనాలు చల్లడం...విజయపూర్ నగర శివార్లలోని కృషి మహావిద్యాలయ ఆవరణలో వ్యవసాయ మేళా నిర్వహించారు.  ఎమ్మెల్యే విఠల కటకదొండ రాజుగౌడ్‌ పాటిల్‌ కృషి మేళాను ప్రారంభించారు.

2 / 5
కరువు విలయతాండవం చేసిన సందర్బంలో కూడా కృషి మేళా నిర్వహించారు. నగర శివార్లలోని కృషి మహావిద్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతరకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

3 / 5
వివిధ రకాల పుష్పాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోపురం ప్రతిరూపం, నిమ్మకాయలో వికసించిన శివలింగం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  పుచ్చకాయల్లోని కళాఖండాలు, ఔషధ గుణాలు కలిగిన పండ్లు, కూరగాయలు కూడా ప్రదర్శనలో ఉంచారు.  క్యూలో నిలబడిన ప్రజలు పండ్లు, పుష్ప ప్రదర్శనను ఆసక్తగా తిలకించారు.

4 / 5
వ్యవసాయ మేళాలో డ్రోన్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ.  ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను సర్వే చేయడానికి డ్రోన్‌ను ఆధునిక సాంకేతికతగా ఉపయోగిస్తోంది.  విమానం తరహా డ్రోన్ భూమిని కచ్చితంగా సర్వే చేయగలదు.  పొలాల్లో వ్యాధి వచ్చినప్పుడు, ఆ వ్యాధి పొలానికి ఎంత వ్యాపించిందో రికార్డు చేయడానికి ఈ డ్రోన్ ప్రతిదీ చేస్తుంది.

5 / 5
Follow us