పెళ్లి ఇంట్లో రామజపం.. రామమందిర ప్రతిష్టాపన రోజున పెళ్లి చేసుకున్న జంట.. జై శ్రీరామ్‌ అంటూ..

భారతదేశపు కోట్లాది మంది రామభక్తుల కల సాకారమైంది. అయోధ్యలో నిలువెత్తు రామమందిరపు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రపంచం మొత్తం ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసి పులకించిపోయింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా రామోత్సవ వేడుకలు జరిగాయి. అలాగే, కర్ణాటకలోనూ గల్లీ గల్లీలో రామమందిర ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహించారు. కర్ణాటక దహంగరేలో జరిగిన ఓ పెళ్లి ఇంట్లో రామ నామస్మరణ మార్మోగింది.

Jyothi Gadda

|

Updated on: Jan 22, 2024 | 7:51 PM

రామమందిర ప్రారంభోత్సవంలో పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దావణగెరె నగరంలోని బాపూజీ కళ్యాణ మండపంలో జరిగిన కళ్యాణోత్సవం, రామమందిర ప్రారంభోత్సవంతో మరింత కలకలలాడింది.

1 / 5
శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం రోజునే పెళ్లి చేసుకున్నందుకు దావణగెరెకు చెందిన రోహిత్, అర్పిత ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా కళ్యాణ మండపంలో కూడా రాముడి ఫొటో పెట్టి పూజలు చేశారు.

2 / 5
నూతన దంపతులు రాముడి ఫోటోను పెట్టుకుని భక్తితో పూజించారు. అతిథులతో కలిసి జై శ్రీరామ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. రామమందిర ప్రాణప్రతిష్ట రోజునే పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం పట్ల కొత్త జంట ఆనందం వ్యక్తం చేసింది.

3 / 5
పెళ్లి వేదికపై ఏర్పాటు చేసిన రాముడు ఫోటో ముందు నిలబడి ..పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి ఫొటోలు దిగారు. అలాగే, రామమందిరం ప్రారంభం రోజున గర్భిణులు ప్రసవం కోసం వైద్యుల వద్దకు క్యూ కట్టారు.

4 / 5
మొత్తానికి అటు దేశవ్యాప్తంగా,  రాష్ట్రంలోని దేవాలయాలు, ఇళ్లలో శ్రీరామ నామస్మరణ జరిగితే ఇక్కడ కళ్యాణమండపంలో కూడా శ్రీరామ నామస్మరణ జరగడం విశేషం.

5 / 5
Follow us