- Telugu News Photo Gallery Cinema photos Are directors of Kanguva, Thangalaan following Leo director Lokesh Kanagaraj in delaying movie release
Tollywood News: రిలీజ్ తేదీలపై ‘సినిమాల’ భవితవ్యం.. ఆ యువ దర్శకుడిని ఫాలో అవుతోన్న మేకర్స్..
సినిమా ఓపెనింగ్ రోజే ఓ డేట్ కమిట్ అయి, ఆ తేదీకి పక్కాగా ప్రాజెక్ట్ రిలీజ్ చేయడం పాత పద్ధతి. ప్రాజెక్ట్ స్పాన్ పెరుగుతున్న కొద్దీ రిలీజ్ డేట్ల విషయాన్ని నిలిచి, నిదానంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు ట్రెండీ మేకర్స్. ఆల్రెడీ ఈ లిస్టులో పేరు రిజిస్టర్ చేసుకున్నారు లోకేష్ కనగరాజ్. మరి కొత్తగా జాయిన్ అయిందెవరు? చూసేద్దామా..... లియో సినిమా విడుదలయ్యాక తలైవర్ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీ అయ్యారు లోకేష్ కనగరాజ్.
Updated on: Jan 22, 2024 | 7:09 PM

సినిమా ఓపెనింగ్ రోజే ఓ డేట్ కమిట్ అయి, ఆ తేదీకి పక్కాగా ప్రాజెక్ట్ రిలీజ్ చేయడం పాత పద్ధతి. ప్రాజెక్ట్ స్పాన్ పెరుగుతున్న కొద్దీ రిలీజ్ డేట్ల విషయాన్ని నిలిచి, నిదానంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు ట్రెండీ మేకర్స్. ఆల్రెడీ ఈ లిస్టులో పేరు రిజిస్టర్ చేసుకున్నారు లోకేష్ కనగరాజ్. మరి కొత్తగా జాయిన్ అయిందెవరు? చూసేద్దామా.....

లియో సినిమా విడుదలయ్యాక తలైవర్ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీ అయ్యారు లోకేష్ కనగరాజ్. సినిమా రిలీజ్ డేట్‌ని ముందే అనౌన్స్ చేస్తే, అనవసరమైన టెన్షన్ ఇబ్బందిపెడుతోందని, రజనీకాంత్ సినిమా రిలీజ్ డేట్‌ని ముందుగా ప్రకటించనని స్ట్రాంగ్‌గా చెప్పేశారు లోకేష్. ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు కంగువ మేకర్స్.

సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. సూర్య పార్ట్ షూటింగ్ పూర్తయింది. బాబీ డియోల్ సీన్స్ తో పాటు మరికొంత భాగాన్ని చిత్రీకరించాలి. అదంతా పూర్తయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ పనులున్నాయి.

అందుకే రిలీజ్ డేట్‌ని కమిట్ కావాలనుకోవడం లేదు కెప్టెన్ శివ. అన్నీ పనులు పూర్తయ్యాక నింపాదిగా ఓ డేట్‌కి ఫిక్సవ్వాలని భావిస్తున్నారు.

విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్టే ఇంటర్నేషనల్ లెవల్లో ప్రమోట్ చేయడానికి కూడా చియాన్ సిద్ధం. అందుకే, అన్నిటినీ కేల్కులేట్ చేసుకునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.




