- Telugu News Photo Gallery Cinema photos Captain Miller, Ayalaan and Hrithik Roshan Fighter movie competing at boxoffice for Republic Day
Tollywood Newa: రిపబ్లిక్ డే కి.. తెలుగు సినిమాలతో పాటు పెరిగిన పొరుగు సినిమాల పోటీ..
సమ్మర్ మీద ఖర్చీఫ్ వేసిన స్ట్రెయిట్ సినిమాల గురించే కాదు, రిపబ్లిక్ డే కి వస్తున్నామంటూ డిక్లేర్ చేసిన పొరుగు సినిమాల మీద కూడా క్రేజ్ బాగానే కనిపిస్తోంది. నార్త్ నుంచి ఓ సినిమా బరిలోకి దిగుతుంటే, సౌత్ నుంచి రెండు సినిమాలు డిఫరెంట్ థీమ్స్ తో పోటీకొస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా స్పెషాలిటీ ఏంటి? చూసేద్దాం రండి.... లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్ రిలీజ్ అయింది. వెయ్యి కోట్ల సినిమాగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: TV9 Telugu
Updated on: Jan 24, 2024 | 4:33 PM

సమ్మర్ మీద ఖర్చీఫ్ వేసిన స్ట్రెయిట్ సినిమాల గురించే కాదు, రిపబ్లిక్ డే కి వస్తున్నామంటూ డిక్లేర్ చేసిన పొరుగు సినిమాల మీద కూడా క్రేజ్ బాగానే కనిపిస్తోంది. నార్త్ నుంచి ఓ సినిమా బరిలోకి దిగుతుంటే, సౌత్ నుంచి రెండు సినిమాలు డిఫరెంట్ థీమ్స్ తో పోటీకొస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా స్పెషాలిటీ ఏంటి? చూసేద్దాం రండి....

లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్ రిలీజ్ అయింది. వెయ్యి కోట్ల సినిమాగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సేమ్ డేట్‌ని టార్గెట్ చేస్తున్నారు హృతిక్ రోషన్. లాస్ట్ ఇయర్ షారుఖ్ తో జోడీ కట్టిన దీపిక పదుకోన్, ఈ ఏడాది హృతిక్‌తో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అదుర్స్ అనిపిస్తోంది. ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో, సినిమా మీద బజ్ కూడా ఓ రేంజ్‌లో ఉంది.

సంక్రాంతి సినిమాల సంగతేంటి గురూ అని డిస్కషన్ మొదలైన ప్రతిచోటా మన సినిమాలతో పాటు పొరుగు సినిమాల ప్రస్తావన కూడా వస్తోంది. అలాంటి సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉంది కెప్టెన్ మిల్లర్. ధనుష్ నటించిన పీరియాడిక్ సినిమా ఇది. తన కెరీర్‌లో అద్భుతమైన జర్నీ ఈ సినిమా కోసం చేసినట్టు డిక్లేర్ చేశారు ధనుష్.

ఆల్రెడీ తమిళ్‌లో విడుదలైంది కెప్టెన్ మిల్లర్. అదే పేరుతో ఈ నెల 25న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ధనుష్ గెటప్ నుంచి, యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన తీరు వరకు ప్రతిదీ కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్.

విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ జనవరి 26 విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది. హన్సిక మోత్వాని నటించిన 105 మినిట్స్ ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది. తమిళ్‌లో మంచి పేరు తెచ్చుకున్న అయలాన్ కూడా సేమ్ డేట్ మీద ఖర్చీఫ్ వేసింది.





























