- Telugu News Photo Gallery Cinema photos Tollywood Star Heroine Sreeleela interesting comments on her Education
Sreeleela: ఎవరు అడిగినా ఒకటే సమాధానం.. స్విచ్ఛాఫ్ అండ్, స్విచ్ఛాన్ మోడ్ అంటున్న క్యూట్ బ్యూటీ..
స్విచ్ఛాన్ చేయాలి.. స్విచ్ఛాఫ్ కావాలి... ఇదేదో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యవహారం అనుకునేరు... అస్సలు కాదండోయ్... తన మైండ్ సెట్ గురించి శ్రీలీల ఇచ్చిన స్టేట్‌మెంట్. ఇంతకీ ఆన్ అండ్ ఆఫ్ అంటూ ఈ బ్యూటీ ఏం చెప్పినట్టు? చూసేద్దామా.... శ్రీలీల పేరు చెప్పగానే అందరికీ బిజీ హీరోయిన్, టాప్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్స్ ఎలా గుర్తుకొస్తాయో, అద్భుతమైన డ్యాన్సులు చేసే హీరోయిన్ అనే మాట కూడా అంతే స్పీడ్‌గా గుర్తుకొచ్చేస్తుంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jan 22, 2024 | 3:46 PM

Sreeleela

శ్రీలీల పేరు చెప్పగానే అందరికీ బిజీ హీరోయిన్, టాప్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్స్ ఎలా గుర్తుకొస్తాయో, అద్భుతమైన డ్యాన్సులు చేసే హీరోయిన్ అనే మాట కూడా అంతే స్పీడ్‌గా గుర్తుకొచ్చేస్తుంది. 'ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయాలంటే హీరోలందరికీ తాట ఊడిపోద్ది... వామ్మో అదేం డ్యాన్సూ' అంటూ ఈ మధ్య మహేష్ నుంచి వండర్‌ఫుల్ కాంప్లిమెంట్ అందుకున్నారు మిస్ శ్రీలీల.

వరుసగా అన్ని సినిమాలు, అన్ని పాత్రలు... ఓ వైపు చదువు, ఇంకో వైపు నటన... ఎలా బ్యాలన్స్ చేస్తున్నారు? అని ఎవరైనా శ్రీలీలను అడిగితే ఒకటే సమాధానం వినిపిస్తోంది. అదే... స్విచ్ఛాఫ్ అండ్, స్విచ్ఛాన్ మోడ్. తన స్ట్రెంగ్త్ అదేనని క్లారిటీగా చెప్పేస్తున్నారు శ్రీలీల.

ఒకే రోజు మూడు సినిమాల సెట్స్ కి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చినా ఏమాత్రం కంగారుపడనని అంటున్నారు శ్రీలీల. సెట్లో నుంచి అడుగుబయటపెట్టేటప్పుడే ఆ విషయాలను మరిచిపోతానని చెబుతున్నారు. డిటాచ్డ్ గా ఉండగలగడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నది శ్రీలీల చెప్పే మాట.

డ్యాన్సులు బాగా చేస్తారని ఎవరు ప్రశంసిస్తే బూస్ట్ తాగినట్టు అనిపిస్తుందట శ్రీలీలకు. అంతకు మించిన ఎనర్జీతో నెక్స్ట్ పాటకు ప్రిపేర్ అవుతానని చెబుతున్నారు శ్రీలీల. పనిని ఎంజాయ్ చేయడం మొదలుపెడితే, స్ట్రెస్ ఉండదన్నది ఈ బ్యూటీ నమ్మే సిద్ధాంతం.





























