Special Trains: తిరుమల వెంకన్న భక్తులకు అదిరిపోయే న్యూస్‌.. అందుబాటులోకి నాలుగు ప్రత్యేక రైళ్లు..

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్‌ ట్రైన్స్‌ జనవరి 25,26,27,28 తేదీల్లో నడవనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన...

Special Trains: తిరుమల వెంకన్న భక్తులకు అదిరిపోయే న్యూస్‌.. అందుబాటులోకి నాలుగు ప్రత్యేక రైళ్లు..
Special Trains
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2024 | 7:31 PM

తిరుమల వెంకన్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్‌ ట్రైన్స్‌ జనవరి 25,26,27,28 తేదీల్లో నడవనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* ట్రైన్‌ నెంబర్‌ 07041 సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలు గురువారం సికింద్రాబాద్‌ నుంచి 20.00 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 9.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు గురువారం (25-01-2024)రోజున బయలుదేరుతుంది.

* తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ట్రైన్‌ నెంబర్‌ 07042 ట్రైన్‌ నెంబర్‌ రైలు తిరుపతి నుంచి శుక్రవారం 19.50 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 26వ తేదీన ప్రారంభమవుతుతుంది.

* సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే 02764 నెంబర్‌ ట్రైన్‌ సికింద్రాబాద్‌ నుంచి శనివారం 18.40 గంటలకు బయలు దేరి, ఆదివారం ఉదయం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 27వ తేదీన బయలు దేరుతుంది.

* తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే 02763 నెంబర్‌ ట్రైన్‌ ఆదివారం 17.15 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి, సోమవారం ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 28వ తేదీన తిరుపతి నుంచి బయలు దేరుతుంది.

ఏయే స్టేషన్స్‌లో ఆగుతాయంటే..

* ట్రైన్‌ నెంబర్‌ 07041/07042 సికింద్రాబాద్‌ – తిరుపతి – సికింద్రాద్‌ స్పెషల్‌ ట్రైన్‌.. కాచిగూడ, ఉమ్దానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల్‌, రాయిచూర్‌, మంత్రాలయం రోడ్‌, గుంతకల్‌, తాడిపత్రి, ఎర్రగుంట్ల, రాజంపేట, రేణిగుంట స్టేషన్స్‌లో ఆగుతుంది.

* ఇక ట్రైన్‌ నెంబర్‌ 02764/02763 సికింద్రాబాద్‌-తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్‌ ట్రైన్స్‌.. జనగాన్‌, కాజిపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాలా, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణింగుంట స్టేషన్స్‌లో ఆగుతుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..