Hyderabad: అట్టహాసంగా అయోధ్య రామ మందిర విజయ్ దివాస్ ఉత్సవాలు
శతాబ్దాల కాలంగా కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల కోసం వేచి చూసారని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్ చెప్పారు. భారత్ లో కొత్త కాల చక్రం మొదలైందని, అన్ని మతాలవారు సామరస్యంగా జీవించాలి ఆకాంక్షించారు. కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల కోసం వేచి చూసారని చెప్పారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ శుభ వేళ హైదరాబాద్‌లో కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. వందల ఏళ్ల అయోధ్య రామ మందిరం కల నెరవేరినందుకు కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల శతాబ్దాల కాలంగా నుంచి ఎదురుచూశారని చెప్పారు. భారత్‌లో కొత్త కాల చక్రం మొదలైందని, అన్ని మతాలవారు సామరస్యంగా జీవించాలి ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పించాలని కృష్ణ ధర్మ పరిషత్ నిర్ణయించిందని అభిషేక్ గౌడ్ తెలిపారు. krishnadharma.in లోకి లాగిన్ ద్వారా ఆసక్తి కలిగిన వారు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం తిరస్కరించిన కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పాలన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు కే లక్ష్మణ్ కు అభిషేక్ గౌడ్ ఒక అభ్యర్దన చేసారు. పార్టీకి అంకితమై, నిబద్దతతో పని చేస్తున్న రామ్ యాదవ్‌కు మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలన్నారు. యువతకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మోదీ నాయకత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. రాము యాదవ్ లాంటి అంకిత భావం ఉన్న వారికి సీటు ఇస్తే యువత మరింత జోష్‌తో పనిచేస్తుందన్నారు.
ధర్మ పరిరక్షణ కోసం సంస్థను ఏర్పాటు చేసిన అభిషేక్ గౌడ్ ను రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అభినందించారు. సర్వేజనా సుఖినోభవంతు అనేది సనాతన ధర్మం లక్ష్యమని చెప్పారు. తమిళనాడులో రామాలయాల్లో రామ మందిరం ఉత్సవం జరుపుకోద్దని పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలానే లౌకిక వాదం ముసుగులో అడుగడుగునా కొన్ని పార్టీలు హిందువులను అగౌరపరుస్తన్నారని.. వారందరూ ప్రజల ఆగ్రహం ఎదుర్కొనాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో రాముడి భజనలు, కీర్తనలతో ఆథ్మాత్మిక సందడి కొనసాగింది.పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి.. భక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి.