AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spring Onions Benefits: ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవాలసిందే..! ముఖ్యంగా చలికాలంలో..

ఉల్లికాడలలోని యాంటి హిస్టమైన్ పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది. ఉల్లికాడలలో స్ధూల పోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు..తరచూ ఉల్లికాడలు తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ పెరుగుతుంది. ఇది చర్మం మెరుపును పెంచుతుంది.

Spring Onions Benefits: ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవాలసిందే..! ముఖ్యంగా చలికాలంలో..
Spring Onions
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2024 | 5:30 PM

Share

సాధారణంగా మనందరం ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లిపాయల్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటాం..అయితే, ఈ రెండింటికి వాటి సొంత ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఆరోగ్యకరమైన శరీరం కోసం మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలతో పాటు.. ఉల్లికాడలను కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లి కాడలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. లేత ఉల్లికాడలు గొప్ప రుచిని, పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. కెలరీలు, కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు. ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఉల్లికాడలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది. ఉల్లికాడలలో కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ ఉన్నాయి. ఉల్లికాడలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయ పడుతుంది. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఉల్లి కాడలు దివ్య ఔషధంగా చెబుతారు.. ఉల్లి కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది.

ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి. వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. వీటిలోని ఫొలేట్లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ బాధితులకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. గ్లూకోజ్ శక్తిని పెంచుతుంది. ఉల్లికాడలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయ పడుతుంది. ఉల్లికాడలలోని యాంటి హిస్టమైన్ పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది. ఉల్లికాడలలో స్ధూల పోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు..తరచూ ఉల్లికాడలు తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ పెరుగుతుంది. ఇది చర్మం మెరుపును పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..