AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జై శ్రీరామ్‌.. స్వస్తిక్ నుంచి జవాన్ తీసిన అందమైన శ్రీరాముడి చిత్రం.. అద్భుత వీడియో వైరల్‌..

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా naresh_fouji_art నుండి షేర్‌ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో స్వస్తిక్ నుంచి శ్రీరాముడిని ఎలా గీయాలో ఈజీగా నేర్చుకోండి అంటూ రాశారు. వీడియో షేర్‌ చేసిన ఇన్‌స్టా ఖాతా జవాన్‌కు చెందినదిగా తెలిసింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు.. వావ్! చాలా అందంగా, అద్భుతంగా ఉందని చెప్పగా, వీడియోపై 'జై శ్రీ రామ్' అంటూ చాలా మంది నెటిజన్లు స్పందించారు.

Watch Video: జై శ్రీరామ్‌.. స్వస్తిక్ నుంచి జవాన్ తీసిన అందమైన శ్రీరాముడి చిత్రం.. అద్భుత వీడియో వైరల్‌..
Shree Ram Beautiful Drawing
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2024 | 9:18 PM

Share

అయోధ్యలో రామమందిరం అట్టహాసంగా ప్రారంభించబడింది. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పలుచోట్ల దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. శ్రీరాముడి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది రామభక్తులు రాముడిపై తమ ప్రేమ, భక్తిని వివిధ మార్గాల్లో వ్యక్తపరుస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాముడి రంగోలి గీస్తూ కనిపిస్తే మరికొందరు రాముడి పాటలు పాడుతూ కనిపించారు. కొంతమంది రాముని పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తే, మరికొందరు శ్రీరామునిపై పద్యాలు చేబుతున్నారు. ఇలాగే, ఓ వీడియో సోషల్‌ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఒక యువకుడు స్వస్తిక్‌ నుండి శ్రీరాముని చిత్రాన్ని గీస్తున్నట్లు కనిపించాడు. అతని ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వీడియో చూసి కొందరు అతని కళకు ఉబ్బితబ్బిబ్బవుతున్నామంటున్నారు.

ఈ వైరల్ వీడియోలో, ఈ యువకుడు బ్లాక్ బోర్డ్‌పై తెల్లటి సుద్దముక్కతో స్వస్తిక్‌ను గీయడం మీరు చూడవచ్చు. ఈ స్వస్తిక్ నుండి శ్రీరాముని బొమ్మను చిత్రించవచ్చని మొదట ఎవరూ అనుకోరు. కానీ, ఈ వీడియో చూస్తే అది సాధ్యమే అంటారు.. యువకుడు ఎంతో కళాత్మకంగా స్వస్తిక్‌ నుండి శ్రీరాముని చిత్రాన్ని గీస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీరామ్ మోకాళ్లపై కూర్చుని విల్లు, బాణాలు వేస్తున్నట్లు కనిపిస్తాడు. చిత్రాన్ని గీసిన తర్వాత, యువకుడు చిత్రం పైన జై శ్రీరామ్ అని రాశాడు. ఈ వీడియో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా naresh_fouji_art నుండి షేర్‌ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో స్వస్తిక్ నుంచి శ్రీరాముడిని ఎలా గీయాలో ఈజీగా నేర్చుకోండి అంటూ రాశారు. వీడియో షేర్‌ చేసిన ఇన్‌స్టా ఖాతా జవాన్‌కు చెందినదిగా తెలిసింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు.. వావ్! చాలా అందంగా, అద్భుతంగా ఉందని చెప్పగా, వీడియోపై ‘జై శ్రీ రామ్’ అంటూ చాలా మంది నెటిజన్లు స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..