- Telugu News Photo Gallery A Person Cannot Drown In Dead Sea, Know The Main Scientific Reason Telugu News
ఈ సముద్రంలో మీరు పడిపోయినా మునిగిపోలేరు.. నీటిపై నడుస్తూ ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..
మీకు ఈత కొట్టడం తెలియదా? డోంట్‌వర్రీ.. మీరు సముద్రం మధ్యలోకి వెళ్లి పేపర్ చదవడం నుండి నీటిలో తేలియాడుతూ తినడం వరకు ప్రతిదీ చేయవచ్చు. ఓడలో ప్రయాణిస్తూ.. అనుకుంటున్నారేమో..అస్సలు కాదు..ఎందుకంటే.. ఏంచక్కా నీటిపై నడుస్తూనే ఇవన్నీ చేయొచ్చు.. ఎందుకంటే..మనిషి పడిపోయినా మునగని సముద్రం ఒకటి ఉంది. చనిపోయిన వ్యక్తులు నీటిలో తేలుతుంటారని ఇప్పటివరకు విన్నాను. కానీ అలా కాదు, ప్రపంచంలో ఒక సముద్రం ఉంది, అందులో మీరు తేలియాడవచ్చు.
Updated on: Jan 23, 2024 | 7:48 PM

మనిషి పడిపోయినా మునగని సముద్రం ఉంది. చనిపోయిన వ్యక్తులు నీటిలో తేలుతుంటారని ఇప్పటివరకు విన్నాం. కానీ అలా కాదు, ప్రపంచంలో ఒక సముద్రం ఉంది. అందులో మీరు తేలియాడవచ్చు. అందుకోసం మీరు ఈత కొట్టాల్సిన అవసరం లేదు. జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ సముద్రాన్ని డెడ్ సీ అంటారు. పొరపాటున ఈ సాగరంలో పడిపోయినా కూడా మునగరు..కానీ, మీ శరీరం నీటిలో తేలుతుంది.

వాస్తవానికి సముద్రపు నీరు సాధారణంగా ఉప్పగా ఉంటుంది. కానీ ఈ మృత సముద్రపు నీరు చాలా ఉప్పుగా ఉంటుంది. అందులో ఏ జీవి కూడా జీవించదు. ఈ సముద్రంలో చేపనైనా పెడితే వెంటనే నీళ్లలో చచ్చిపోతుంది.

శాస్త్రవేత్తల ప్రకారం, మృత సముద్రపు నీటిలో బ్రోమైడ్, జింక్, సల్ఫర్, పొటాష్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయట. దాంతో ఈ సముద్రం చాలా ఉప్పగా మారుతుంది.

అయితే ఈపాటికి మీ మదిలో మెదులుతూ ఉండాలి, ఉప్పగా ఉండడానికి, తేలడానికి సంబంధం ఏమిటి ? నిజానికి కారణం భిన్నమైనది, ఆసక్తికరమైనది. డెడ్ సీ నిజానికి సముద్ర మట్టానికి 1388 అడుగుల దిగువన ఉంది. దీని కారణంగా దాని సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సముద్రంలో నీటి ప్రవాహం దిగువ నుండి పైకి ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి నీటిలోకి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, అతను నీటి ఉపరితలంపై తేలడం ప్రారంభిస్తాడు.

అంటే అందులో పడుకున్నా మునగరని అర్థమైంది. మృత సముద్రపు నీటిలో 50 శాతం మెగ్నీషియం క్లోరైడ్, 30 శాతం సోడియం క్లోరైడ్, 14 శాతం కాల్షియం క్లోరైడ్ మరియు 4 శాతం పొటాషియం క్లోరైడ్ ఉన్నాయి.
