- Telugu News Photo Gallery These three kitchen ingredients best for skin care, check here is details in Telugu
Skin Care: ఈ చౌవకైన వస్తువులతో మీ ముఖాన్ని చంద్రబింబంలా మెరిపించండి!
అందంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. అందంగా కనిపించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేసే ఉంటారు. ఇంకొంత మంది అయితే ముఖంలో గ్లో కోసం వేల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ మనకు ఎప్పుడూ ఇంట్లోనే ఉండే కొన్ని రకాల వస్తువులతో ముఖాన్ని ఎంతో అందంగా మార్చుకోవచ్చు. ముఖంపై మచ్చలు, ముడతలు కనిపించినా కంగారు పడిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా..
Updated on: Jan 23, 2024 | 8:07 PM

అందంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. అందంగా కనిపించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేసే ఉంటారు. ఇంకొంత మంది అయితే ముఖంలో గ్లో కోసం వేల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ మనకు ఎప్పుడూ ఇంట్లోనే ఉండే కొన్ని రకాల వస్తువులతో ముఖాన్ని ఎంతో అందంగా మార్చుకోవచ్చు.

ముఖంపై మచ్చలు, ముడతలు కనిపించినా కంగారు పడిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా చర్మం దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లతో శరీరమే కాకుండా చర్మం, జుట్టు కూడా హెల్దీగా ఉంటాయి.

చాలా మంది చర్మాన్ని మెరిపించడానికి ఎన్నో వేల రకాల కాస్మెటిక్స్‌ని కూడా ఉపయోగించే ఉంటారు. కానీ వాటితో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వీటికి బదులుగా నేచురల్‌గా ఇంట్లో లభ్యమయ్యే వాటితోనే చర్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు.

పాలు, పెరుగు, నిమ్మ కాయలు అందరి ఇంట్లో కూడా విరివిగా లభ్యమవుతాయి. ఇవి శరీరానికి అవసరమైనో పోషకాలను కలిగి ఉన్న సంపూర్ణ ఆహారంగా చెప్పొచ్చు. వీటితో చాలా రకాల ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ సాఫ్ట్‌గా తయారై, మృత కణాలు తొలగిపోతాయి.

పెరుగును కూడా ముఖానికి రాసుకోవచ్చు. పెరుగును ముఖానికి రాసుకుంటే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి.. ముఖం కాంతి వంతంగా మారుతుంది. చర్మ సమస్యల్ని తగ్గించడంలో నిమ్మ కాయ చక్కగా పని చేస్తుంది. నిమ్మరసంలో గ్లిజరిన్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే.. స్కిన్ అందంగా, సాఫ్ట్‌గా పని చేస్తుంది. నిమ్మ కాయ, పెరుగు, పాలను బ్యూటీ ప్రాడెక్ట్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు.




