AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Eamcet 2024 Exam Date: మే రెండో వారంలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష..! నేడో రేపో ప్రవేశ పరీక్షల తేదీల వెల్లడి

తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష మే నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌తో సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను నేడో రేపో ప్రకటించనున్నారు. ఎంసెట్‌ పేరు మార్పుపై ప్రభుత్వం జీవో జారీ అయితే ఈ రోజు సాయంత్రానికి పరీక్షల తేదీలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన టైం టేబుల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో..

TS Eamcet 2024 Exam Date: మే రెండో వారంలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష..! నేడో రేపో ప్రవేశ పరీక్షల తేదీల వెల్లడి
TS Eamcet 2024
Srilakshmi C
|

Updated on: Jan 25, 2024 | 6:57 AM

Share

హైదరాబాద్‌, జనవరి 25: తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష మే నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌తో సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను నేడో రేపో ప్రకటించనున్నారు. ఎంసెట్‌ పేరు మార్పుపై ప్రభుత్వం జీవో జారీ అయితే ఈ రోజు సాయంత్రానికి పరీక్షల తేదీలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన టైం టేబుల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో మే రెండో వారంలో ఎంసెట్‌ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మిగతా పీఈసెట్‌, పీజీఈసెట్‌లు మాత్రం మే చివరి వారం నుంచి జూన్‌ తొలి వారంలో జరగనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడ ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

కాగా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రోజు ఎంసెట్‌తోపాటు ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. వీటిల్లో ఈసెట్‌ను మే మొదటి వారంలో నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌లో ఈసారి పరీక్ష విధానాన్ని మార్చాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సిఫారసు చేసింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియరాలేదు.

జనవరి 29, 30తేదీల్లో ఏపీ అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీలు విడుదలయ్యాయి. జనవరి 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ లెర్నింగ్ సపోర్ట్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌ ఎల్‌ విజయకృష్ణారెడ్డి తెలిపారు.ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారు హైదరాబాద్‌లోని విద్యాలయం ప్రాంగణంలో నిర్వహించే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. మెరిట్‌ ఆధారంగా 15శాతం కేటాయిస్తామని, మిగతా 85శాతం సీట్లు స్థానికులకు కేటియించనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక విభాగంలో సీట్లు మిగిలితే ఇతర విభాగం ఎంచుకున్న వారు కూడా మార్చుకుని ప్రవేశాలు పొందొచ్చని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..