Layoffs: ఐటీలో అసలేం జరుగుతోంది.? 8వేల మంది ఉద్యోగులకు ఎసరు పెట్టేలా..
కొత్తేడాదిలో కూడా భారీగా ఉద్యోగాల కోత ఉండేలా స్పష్టమవుతోంది. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి. ప్రముఖ లేఆఫ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ ప్రకారం.. ఈ జనవరి నెలలో మొత్తం 63 టెక్ సంస్థలు 10,963 మంది ఉద్యోగులను తొలగించాయి. ఏడాది ప్రారంభంలో...
ఐటీ రంగంలో లేఆఫ్స్ మరోసారి అలజడి రేపుతున్నాయి. గతేడాది వరుసగా టెక్ దిగ్గజాలను ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలైన అమెజాన్, గూగుల్ యాపిల్, ఫేస్‌బుక్ వంటి ఎన్నో సంస్థలను ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే కొత్తేడాది అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో అని సంతోషించేలోపే సంతోషం కాస్త ఆవిరైపోయేలా ఉంది.
కొత్తేడాదిలో కూడా భారీగా ఉద్యోగాల కోత ఉండేలా స్పష్టమవుతోంది. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి. ప్రముఖ లేఆఫ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ ప్రకారం.. ఈ జనవరి నెలలో మొత్తం 63 టెక్ సంస్థలు 10,963 మంది ఉద్యోగులను తొలగించాయి. ఏడాది ప్రారంభంలోనే గూగుల్ ఒకేసారి ఏకంగా వెయ్యి మందిని ఉద్యోగులను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే అనంతరం ఈబే కూడా సుమారు వెయ్యి మందిని తొలగించింది. ఈ తొలగింపులు ఇక్కడితోనే ఆగవని ఇంకా కొనసాగుతాయని సంస్థ తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ కూడా ఉద్యోగులను భారీగా తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్‌ఏపీ ఎస్‌ఈ ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఖర్చులతను తగ్గించుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టిసారించిన ఈ సంస్థ సుమారు 8వేల మందిని తొలగించాలని చూస్తోంది. ఈ ఏడాది కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. ఇది చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే పుననిర్మాణ ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవులు, ఇంటర్నల్ రీ స్కిల్లింగ్ ద్వారా సర్దుబాటు చేపట్టనున్నట్లు సంస్థ చెబుతోంది. కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని సాప్ చెబుతోంది. ఇదిలా ఉంటే గతేడాది చివరి నాటికి సాప్ కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..