Maths Competition: మ్యాథ్స్‌లో మీరు తోపులా.. అయితే రూ.1 లక్ష గెలుచుకునే అవకాశం
ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ 2024 పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రేట్ టెక్నాలజలీ సైంటిస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా 2024 పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో తమకు గణితంలో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించుకోవాలని ఆశపడే కాలేజీ లేదా స్కూల్ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు...
మీరు లెక్కలు బాగా చేయగలరా.? అయితే మీకు ఓ శుభవార్త. ఏకంగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ దీనికి సంబంధించిన ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ 2024 పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రేట్ టెక్నాలజలీ సైంటిస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా 2024 పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో తమకు గణితంలో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించుకోవాలని ఆశపడే కాలేజీ లేదా స్కూల్ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ముఖ్యమైన వివరాలు..
ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ 2024లో పాల్గొనలనుకునే వారు 30 ఏప్రిల్ 2024లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షను మే21, 2024న నిర్వహిస్తారు. తుది ఫలితాలను 30 జూన్ 2024న ప్రకటిస్తారు. ఈ పోటీలకు పాల్గొనే అభ్యర్థుల వయసు 10 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి రూ. 290 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి బహుమతికి రూ. 1 లక్ష, రెండో బహుమతికి రూ. 50,000, మూడో బహుమతికి రూ. 25,000 అందిస్తారు.
ఎలా అప్లై చేయాలంటే..
ఇందుకోసం ముందుగా ఏఐసీటీఎస్‌డీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ కనిపించే అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయాలి. ఆ తర్వాత రూ. 290 ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత 48 గంటల్లో మీ రిజిస్టర్ మెయిల్ ఐడీకి హాల్ టికెట్ నెంబర్ వస్తుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..