Honour Killing: వేరే మతస్తుడిని ప్రేమించిందనీ.. చెల్లిని చెరువులోకి తోసేసిన అన్న! కూతురిని కాపాడబోయి తల్లి కూడా..

ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న అక్కసుతో సొంత చెల్లెలినే కడతేర్చాడో అన్న. దీంతో కోపోధ్రిక్తుడైన అన్న చెల్లిని చెరువులోకి తోచి చంపేందుకు యత్నించాడు. గమనించిన తల్లి బిడ్డను కాపాడుకునేందుకు తాను కూడా చెరువులోకి దూకింది. ఈక్రమంలో తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది..

Honour Killing: వేరే మతస్తుడిని ప్రేమించిందనీ.. చెల్లిని చెరువులోకి తోసేసిన అన్న! కూతురిని కాపాడబోయి తల్లి కూడా..
Honour Killing In Mysuru
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 25, 2024 | 8:38 AM

మైసూరు, జనవరి 25: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న అక్కసుతో సొంత చెల్లెలినే కడతేర్చాడో అన్న. దీంతో కోపోధ్రిక్తుడైన అన్న చెల్లిని చెరువులోకి తోచి చంపేందుకు యత్నించాడు. గమనించిన తల్లి బిడ్డను కాపాడుకునేందుకు తాను కూడా చెరువులోకి దూకింది. ఈక్రమంలో తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామానికి చెందిన సతీశ్, అనిత(43) దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు నితిన్‌, ధను శ్రీ. నితిన్‌ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(19) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన ఓయువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. తాజాగా బుర్ఖా ధరించి ప్రేమించిన వ్యక్తితో రోడ్డుపై కనిపించింది. దీంతో నితిన్‌ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. అతనితో స్నేహం మానుకోవాలంటూ పలుమార్లు హెచ్చరించాడు. సోదరుడు హెచ్చరించినప్పటికీ ధనుశ్రీ ఆ వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగించినట్లు సమాచారం. దీంతో చెల్లిని ఎలాగైనా చంపాలని అన్న నితిన్‌ భావించాడు. ఈ క్రమంలో బంధువులకు బాగా లేదంటూ నితిన్‌ తన బైక్‌పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను మంగళవారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య మరోమారు గొడవ జరిగింది. పట్టరాని కోపంతో నితిన్‌ తన చెల్లి చేతులను టవల్‌తో కట్టేసి హున్‌సూర్‌కు సమీపంలోని మరూర్ సమీపంలో ఉన్న చెరువులోకి చెల్లి ధనుశ్రీని నెట్టాడు. కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది.

దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్‌ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి గల్లంతయ్యారు. దీంతో నితిన్‌ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్‌కు జరిగిన విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్‌ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. వీరిద్దరి మృతిపై హుణసూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నితిన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.